వైద్యం పేరుతో మహిళలపై అలాంటి దారుణాలకు పాల్పడుతున్న డాక్టర్....
TeluguStop.com
ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని వృత్తుల్లో కెల్లా వైద్య వృత్తి చాలా పవిత్రమైందని మరియు జీవ రాశులకు ఎంతో ఉపయోగకరమైందని కొందరు పెద్దలు చెబుతుంటారు.
కానీ ఓ డాక్టర్ చేసినటువంటి నీచమైన పనికి పూర్తి గా డాక్టర్ అనే పదానికి కలంకం ఏర్పడింది.
ఓ వైద్యుడు వైద్యం కోసం తన వద్దకు వచ్చేటువంటి మహిళలకి మత్తు మందు ఇచ్చి వారితో తన లైంగిక వాంఛలు తీర్చుకుంటున్న ఘటన యునైటెడ్ స్టేట్స్ లోని ఓహియో రాష్ట్రంలో చేసుకుంది.
వివరాల్లోకి వెళితే ఓ వ్యక్తి ప్లాస్టిక్ సర్జరీ వైద్యుడిగా స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రిలో పని చేస్తున్నాడు.
అయితే ఇతడు వైద్యం కోసం తమ వద్దకు వచ్చేటువంటి మహిళలకి వైద్యం పేరుతో మత్తుమందు ఇచ్చి వారు మత్తుమందు లోకి జారుకున్న తరువాత వారితో తన కామవాంఛలు తీర్చుకుంటూ వికృతంగా చేష్టలకి పాల్పడేవాడు.
అంతేగాక ఈ దురాగతాన్ని కెమెరాలో బంధించి అప్పుడప్పుడు ఆ వీడియోను చూస్తూ ఎంజాయ్ చేసేవాడు.
తాజాగా వైద్యం కోసం వెళ్లి నటువంటి ఓ మహిళ వైద్యుడిపై అనుమానం రావడంతో అతడి పై నిఘా ఉంచింది.
ఈ క్రమంలో అతడు తన పై చేసినటువంటి అఘాయిత్యం గురించి తెలుసుకొని విస్తుపోయింది.
"""/"/
దీంతో వెంటనే దగ్గరలో ఉన్నటువంటి పోలీసులను సంప్రదించి కీచక వైద్యుడిపై తనపై జరిగినటువంటి అఘాయిత్యం గురించి ఫిర్యాదు చేసింది.
దీంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగి వైద్యుడు గురించి విచారణ చేసి అరెస్టు చేశారు.
అలాగే విచారణ నిమిత్తం రిమాండ్ కి తరలించారు.
మంచు మనోజ్ కు షాకిచ్చేలా లేఖ రాసిన తల్లి.. ఈ హీరో ఒంటరివాడు అవుతున్నాడా?