Hrishikesh : రఘువరన్ బీటెక్‌లో ధనుష్ తమ్ముడిగా కనిపించిన ఈ నటుడు బ్యాక్‌గ్రౌండ్ తెలిస్తే ఆశ్చర్యపోతారు…

కోలీవుడ్ సూపర్ స్టార్ ధనుష్( Dhanush ) నటించిన 2014 తమిళ చిత్రం "వేలై ఇల్లా పట్టదారి" ( Velai Illa Pattadari )చాలా తక్కువ అంచనాల నడుమ రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ అయ్యింది.

తరువాత 2015లో తెలుగులో రఘువరన్ బిటెక్ పేరుతో విడుదలైంది.ఈ చిత్రం తెలుగులో కూడా విజయవంతమైంది.

ఇటీవలే థియేటర్లలో దీన్ని రీరిలీజ్ చేశారు.ఈ చిత్రంలో ధనుష్ తమ్ముడిగా కనిపించిన నటుడు కూడా బాగా పాపులర్ అయ్యాడు.

అతను సినిమా మొత్తంలో కనిపిస్తాడు కానీ అతని బ్యాక్‌గ్రౌండ్ ఏంటనేది చాలా మందికి తెలియదు.

కార్తీక్‌గా నటించిన ఈ యాక్టర్ సినిమా పరిశ్రమలో మంచి కనెక్షన్స్ ఉన్నవాడే.ఈ నటుడి పేరు హృషీకేష్( Hrishikesh ).

అతను సంగీత సంచలనం అనిరుధ్ కు బంధువు.ధనుష్ యొక్క బావ అని పుకార్లు ఉన్నాయి.

హృషికేశ్ తన ప్రాథమిక విద్యను PSBB స్కూల్‌లో పూర్తి చేసి, మద్రాస్ యూనివర్సిటీలో విజువల్ కమ్యూనికేషన్‌ను అభ్యసించాడు.

"""/" / వేలై ఇల్లా పట్టదారితో తన సినిమా కెరీర్ ప్రారంభించడానికి ముందు అతను ప్రకటనలు, డాక్యుమెంటరీలలో పనిచేశాడు.

ఆ తర్వాత తెలుగులో వీఐపీ 2, పెద్దన్న, బొమ్మలకొలువు చిత్రాల్లో నటించాడు.1930-1940 కాలం నాటి గొప్ప చలనచిత్ర దర్శకుడు S.

V.రమణన్‌కు, చలనచిత్ర దర్శకుడు కృష్ణస్వామి సుబ్రహ్మణ్యంకు ( Krishnaswamy Subrahmanyam )హృషీకేష్ మనవడు అవుతాడు.

"""/" / సినిమా పరిశ్రమలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటున్న ప్రతిభావంతుడైన నటుడు హృషికేశ్.

తన సహజమైన నటనా నైపుణ్యాలకు చాలాసార్లు ప్రశంసలు అందుకున్నాడు.తన నటనా వృత్తితో పాటు, హృషికేశ్ మంచి ఫోటోగ్రాఫర్, ఫిల్మ్ మేకర్ కూడా.

అతను అనేక షార్ట్ ఫిల్మ్‌లు, డాక్యుమెంటరీలకు దర్శకత్వం వహించాడు.ప్రస్తుతం ఈ టాలెంటెడ్ యాక్టర్ ఉనర్వుగల్ తోడర్కథై( Actor Unarvugal Todarkathai ), రేక్లా సినిమాల్లో నటిస్తున్నాడు.

ఇవి ఎప్పుడు రిలీజ్ అవుతాయి? అనే విషయంపై స్పష్టత లేదు.ఈ సినిమాలు స్మాల్ బడ్జెట్ తోనే వస్తున్నట్టు తెలుస్తోంది.

ధనుష్ అనిరుధ్ వంటి టాప్ సినిమా సెలబ్రెటీలు ఉన్నప్పటికీ వారి హెల్ప్ ఏమాత్రం తీసుకోకుండా సొంతంగా హృషికేశ్ సినీ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

అందుకే అతడు ఇప్పటికీ హైబడ్జెట్ సినిమాల్లో కనిపించడం లేదు.

మధుమేహులకు వరం ఆవాలు.. ఇలా తీసుకుంటే అదిరిపోయే లాభాలు..!