టైట్ గా ఉండే డ్రెస్‌లు వేసుకుంటున్నారా.. ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోండి
TeluguStop.com
ఒకప్పటి మానవుల జీవన విధానానికి, ఇప్పటి మానవుల జీవన విధానానికి ఎన్నో మార్పులు ఉన్నాయి.
ఒకప్పటి కంటే కూడా ఇప్పుడు అనేక ఫ్యాషన్ అలవాట్లు వచ్చిపడ్డాయి.వేసుకునే బట్టల దగ్గరి నుంచి తినే తిండి వరకు అనేక మార్పులు చేశారు.
ఫ్యాషన్ ప్రపంచం విస్తరించడంలో ప్రపంచం మొత్తం దీని మత్తులోనే మునిగి తేలుతోంది.ముఖ్యంగా బట్టల విషయంలో అయితే ఎన్నో స్టైల్ ట్రెండింగ్ వేర్స్ అందుబాటులోకి వచ్చేశాయి.
వేసుకునే బట్టల విషయంలో రోజుకో స్టైల్ బట్టలు వస్తూనే ఉన్నాయి.అయితే వీటి గురించి ఓ షాకింగ్ విషయం తెలిసింది.
చాలామంది యూత్ ఎక్కువగా బిగుతుగా ఉండే బట్టలు వేసుకుంటారు.పైగా వీటికి టైట్ జీన్స్ అని లేదంటే టైట్ ట్రెండీ వేర్ అని పేర్లు కూడా పెట్టుకుంటున్నారు.
ఫ్యాషన్ లో భాగంగా వీటిని వేసుకుంఉటన్నారు.అయిఏత వీటిని వేసుకుంటే ప్రాణాలకే ప్రమాదమని చెబుతున్నారు డాక్టర్లు.
దీని కారణంగా ఇన్‌ఫెక్షన్ వస్తుందని ఆ చోట బ్యాక్టీరియా రెడీ అవుతుందని తెలిపారు డాక్టర్లు.
ఇలా స్కిన్ కోతకు గురైన ప్లేస్ లో వెంటనే ట్రీట్ మెంట్ చేయకపోతే మాత్రం చివరకు చర్మ గ్రంధులు మూసుకుపోతాని, ఇది అత్యంత ప్రమాదకరమని సీనియర్ డాక్టర్లు వెల్లడిస్తున్నారు.
ఇక ఈ రకమైన ఇన్ఫెక్షన్‌గా ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్న వారికి ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు.
అంతే కాకుండా సెప్సిస్, సెల్యూలైటీస్ లాంటి చర్మ వ్యాదులు వస్తాయని, అవి కాస్తా రక్త నాళాల్లోకి ప్రవేశించి శరీరమంతా వ్యాపిస్తాయని హెచ్చరిస్తున్నారు.
కాబట్టి ఇప్పటికైనా టైట్ డ్రెస్సులు వేసుకోవడం మానేయాలని డాక్టర్ సుకృత వివరిస్తున్నారు.
నా భర్త సిద్దార్థ్ అలాంటి మనిషి.. అదితీరావు హైదరీ క్రేజీ కామెంట్స్ నెట్టింట వైరల్!