Perni Nani : ఓటర్లకు డ్రగ్స్ పంచడానికి తెప్పించరా?: మాజీ మంత్రి పేర్ని నాని
TeluguStop.com
ఏపీ సీఈవో ముఖేశ్ కుమార్ మీనా( Mukesh Kumar Meena )ను వైసీపీ నేతలు కలిసిన సంగతి తెలిసిందే.
విశాఖ డ్రగ్స్ వ్యవహారంలో ఫిర్యాదు చేసిన అనంతరం మాజీ మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు.
వైసీపీపై విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.డ్రగ్స్ ఎవరు తెప్పించారన్న పేర్ని నాని ( Perni Nani )మీ చుట్టాలు తెప్పించిన డ్రగ్స్ తమకు అంటగడితే ఎలా అంటూ ధ్వజమెత్తారు.
"""/" /
ఓటర్లకు డ్రగ్స్ పంచడానికి లోకేశ్, చంద్రబాబు తెప్పించారా అని ప్రశ్నించారు.
ఎన్నికల్లో అసాంఘిక శక్తులను ప్రోత్సహించడానికే డ్రగ్స్ తెప్పించారన్న పేర్ని నాని విదేశాల నుంచి డ్రగ్స్ తెచ్చి విక్రయిస్తున్న వారంత టీడీపీ బంధువులేనని ఆరోపించారు.
ఓట్ల కోసం చంద్రబాబు ఏమైనా చేస్తారని తెలిపారు.
బాలయ్య చేస్తున్న డాకు మహారాజ్ మీద ఫుల్ కాన్ఫిడెంట్ తో ఉన్న బాబీ…