చంద్రబాబు కావాలా? జగన్ కావాలా.?.: సజ్జల

విజయవాడలో బీసీల ఐక్యత - అభివృద్ధిపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.

అట్టడుగు వర్గాలు సొంతంగా ఎదగాలనేది సీఎం జగన్ ఆలోచన అని సజ్జల తెలిపారు.

అగ్రవర్ణాలతో పోటీ పడే స్థాయికి వచ్చేలా చేయూత అందిస్తున్నామన్నారు.టీడీపీ హయాంలో అట్టడుగు వర్గాలను ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు.

చిన్న చిన్న పని ముట్లు ఇచ్చిన చంద్రబాబుకు మద్ధతు ఇవ్వాలా అని నిలదీశారు.

ఈ క్రమంలో మంచి విద్య, ఉపాధి ఇచ్చే వారికి మద్ధతు ఇవ్వాలో ఆలోచించాలన్నారు.

ఎన్నికలప్పుడు చిల్లర వేసే నాయకులు కావాలా ? పూర్తిస్థాయి చేయూత అందించే వారు కావాలా? అని ప్రశ్నించారు.

ఈ క్రమంలోనే చంద్రబాబు కావాలా? జగన్ కావాలా? తేల్చుకోవాలని సజ్జల సూచించారు.

మార్క్‌ జుకర్‌బర్గ్ గోల్డ్ చైన్ వెనుక ఇంత పెద్ద కథ ఉందా..?