మీరు తరచూ Facebook వాడుతారా? అయితే ఈ తప్పులు చేయకండి, జైలుకి పోతారు జాగ్రత్త!
TeluguStop.com
ఫేస్‌బుక్.అంటే ఏమిటో తెలియని యువత ఉండనే వుండరు.
మన దేశంలో స్మార్ట్‌ఫోన్ ఉపయోగించే ప్రతి ఒక్కరికీ దాదాపుగా ఫేస్‌బుక్ అకౌంట్ ఖచ్చితంగా ఉంటుంది.
దాన్నిబట్టే అర్ధం చేసుకోవచ్చు ఈ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఎంత ప్రాచుర్యం పొందిందో అని.
అయితే నిరంతరం ఫేస్ బుక్ వాడే వారు కొన్ని తప్పులు చేస్తూ వుంటారు.
ఇకనుండి అలాంటివారిని ఫేస్‌బుక్ యాజమాన్యం ఉపేక్షించదు.ఇక్కడ వినియోగదారులు కొన్ని విషయాలు గుర్తు పెట్టుకోవాలి.
లేదంటే అనవసరం ఇబ్బందులు పడాల్సి వస్తుంది.ఫేస్‌బుక్ ఉపయోగించే వారు కొన్ని నియమనిబంధనలను తెలుసుకోవాలి.
వాటిని అనుసరించాల్సి ఉంటుంది.లేదంటే మాత్రం ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
ఫేస్‌బుక్‌లో ముఖ్యంగా ఇతరులను రెచ్చగొట్టే విషయాలను షేర్ చేయకూడదు.ఇలాంటివి చేస్తే కొన్ని సందర్భాలలో జైలుకు కూడా వెళ్లే ప్రమాదం ఉంటుంది.
అందువల్ల ఫేస్‌బుక్‌లో రెచ్చగొట్టే అంశాలను ఎప్పటికీ పోస్ట్ చేయవద్దు.వీటికి దూరంగా ఉండండి.
అలాగే కొత్త సినిమాను పైరసీ చేసి అమ్మడం కూడా నేరమే. """/"/
అందుకనే మూవీ పైరసీ లింక్స్‌ను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయవద్దు.
అలాగే మతపరమైన మనోభావాలను దెబ్బ తీయవద్దు.ఫేస్‌బుక్ పోస్ట్‌లలో మీరు ఇలాంటివి చేస్తే మిమ్మల్ని పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం కూడా ఉండొచ్చు.
మీరు ఫేస్‌బుక్‌లో అమ్మాయికి ఏదైనా తప్పుడు సందేశం పంపినా, వీడియో లేదా ఫోటో వంటివి పంపినట్లయితే జాగ్రత్తగా ఉండాలి.
ఎందుకంటే మీరు పంపిన మెసేజ్, ఫోటో, వీడియోపై అమ్మాయి ఫిర్యాదు చేస్తే మీరు లాకప్‌కు వెళ్లవలసి ఉంటుందని గుర్తించుకోండి.
ఫేస్‌బుక్‌లో ఎవరికీ బెదిరింపు లేదా అభ్యంతరకరమైన సందేశాలను పంపవద్దు.మీరు ఇలాంటి చర్యలకు పాల్పడితే పెద్ద ఇబ్బందుల్లో పడవచ్చు.
ఛీ.. ఛీ.. రీల్స్ కోసం అన్న శవాన్ని వదలని చెల్లెలు!