విమానాల్లో ట్రావెల్ చేస్తుంటారా.. ఈ 3 ట్రావెల్ ట్రిక్స్ తప్పక తెలుసుకోండి!

విమానాల్లో ప్రయాణించే వారు తప్పక కొన్ని ట్రిక్స్ తెలుసుకోవాలి.అప్పుడే వారికి విమాన ప్రయాణం చాలా సులభతరం అవుతుంది.

కాగా ట్రావెల్ నిపుణుల ప్రకారం మూడు ట్రిక్స్ తెలుసుకుంటే ఎలాంటి కన్ఫ్యూజన్, గందరగోళం లేకుండా జర్నీ పూర్తి చేయవచ్చు.

అడ్వాన్స్ టిక్కెట్‌ బుకింగ్ చివరి నిమిషంలో టిక్కెట్లను బుక్ చేయకుండా ఎల్లప్పుడూ రెండు, మూడు వారాల ముందుగానే బుక్ చేసుకోవడం మంచిది.

చివరి క్షణంలో బుక్ చేసిన టిక్కెట్లకు సాధారణంగా సర్‌ఛార్జ్‌లు ఉంటాయి.మీరు ముందుగానే బుక్ చేసుకుంటే ఈ సర్‌ఛార్జ్‌లు కట్టాల్సిన అవసరం రాదు.

H3 Class=subheader-styleఎయిర్‌పోర్ట్స్‌లో మీట్, గ్రీట్ సర్వీసెస్/h3p విమానాల్లో ప్రయాణించేవారు చాలా ఫార్మాలిటీస్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది.

దానికి తోడు పండుగ సమయాల్లో మరింత గందరగోళం నెలకొంటుంది.ఇలాంటి సమయంలో విమానాశ్రయాలలో సహాయ సేవలను ఎంచుకుంటే చెక్-ఇన్ సమయాన్ని తగ్గించుకోవచ్చు.

మీ ప్రయాణాన్ని ఇబ్బంది లేకుండా చేయడానికి మరిన్ని ఇతర సేవలను కూడా పొందొచ్చు.

ఈ మీట్ అండ్ గ్రీట్ సర్వీసులు మీరు మీ ఫ్లైట్ ఎక్కే వరకు మిమ్మల్ని గైడ్ చేసే ఎగ్జిక్యూటివ్‌ని అందిస్తాయి.

అలానే మీ భారీ లగేజీను మీరు ఈజీగా తీసుకెళ్లొచ్చు.ఎయిర్‌పోర్ట్ మీట్ అండ్ గ్రీట్ సర్వీస్ బగ్గీ, పోర్టర్ సేవలను కూడా అందిస్తుంది.

"""/"/ H3 Class=subheader-styleలేఓవర్‌ల సమయంలో లాంజ్, స్పా/h3p విమానాశ్రయాల్లోని ప్రీమియం లాంజ్‌లలో ముందుగానే యాక్సెస్ పొందడం ద్వారా ప్రియమైన వారి కోసం వెయిట్ చేయడానికి ఎంత సేపైనా హాయిగా విమానాశ్రమంలోనే ఉండొచ్చు.

ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లు పిల్లలను ఎంటర్‌టైన్ చేయడానికి ప్రత్యేక గేమింగ్ జోన్లు, ఆహార ప్రియులను సంతృప్తి పరచడానికి లైవ్ ఫుడ్ కౌంటర్లు, ప్లగ్-ఇన్ పాయింట్లు, హై-స్పీడ్ ఇంటర్నెట్ యాక్సెస్ వంటి అనేక ఇతర యాడ్-ఆన్ సౌకర్యాలను అందిస్తున్నాయి.

ఈ రోజుల్లో లగ్జరీ స్పా సేవలను అందించే విమానాశ్రయాలుగా కూడా అందుబాటులో ఉన్నాయి.

వీటిని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా రిసీవ్ చేసుకునేవారు వచ్చేవరకు చక్కగా టైమ్ స్పెండ్ చేయవచ్చు.

ఇస్కాన్ టెంపుల్ లో అన్నదానం చేసిన హాలీవుడ్ బ్యూటీ.. మన దేశ సాంప్రదాయం పాటిస్తూ?