స్టిక్కర్లు ఉన్న పండ్లు నాణ్యమైనవని భావిస్తున్నారా.. అసలు విషయం ఇదీ!

మనం మార్కెట్‌కు వెళ్లినప్పుడు అక్కడ చాలా రకాల పండ్లు కనిపిస్తాయి.నిగనిగలాడే ఆ పండ్లను చాలా మంది కొనుగోలు చేస్తుంటారు.

ముఖ్యంగా స్టిక్కర్లు అతికించిన పండ్లను ఎక్కువ మంది కొనుగోలు చేయడానికి ఇష్టపడుతుంటారు.ఎందుకంటే మిగిలిన వాటికంటే అవి నాణ్యమైనవని నమ్ముతుంటారు.

వాటిని దేశవిదేశాల నుంచి దిగుమతి చేసుకున్నారని అంతా భావిస్తారు.దీనిపై 'ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా'(FSSAI) ఇటీవల కీలక ప్రకటన చేసింది.

పండ్ల నాణ్యత, ధర, అవి ఎక్కడ ఉత్పత్తి అయ్యాయో, వాటిని ఎలాంటి రసాయనాలు వాడి పెంచారో తెలిపేలా విదేశాలలో ఇటువంటి స్టిక్కర్లు అంటిస్తారని తెలిపింది.

భారత దేశంలో మాత్రం అలాంటి స్టిక్కర్లను యథేచ్ఛగా వాడేస్తున్నారని పేర్కొంది.స్టిక్కర్లు ఉన్నాయని గుడ్డిగా నమ్మేసి కొనొద్దని తెలిపింది.

దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి. """/"/ ఎక్కువ శాతం మంది వ్యాపారులు తాము విక్రయించే పండ్లపై స్టిక్కర్లు అతికిస్తారు.

చిన్న చిన్నగా ఉండే ఆ స్టిక్కర్లను చూపి, అవి విదేశాల నుంచి వచ్చాయని చాలా మందిని బురిడీ కొట్టిస్తుంటారు.

ఎక్కువ ధరకు వాటిని విక్రయిస్తుంటారు.అయితే వాటిని అస్సలు నమ్మొద్దని FSSAI సూచిస్తోంది.

విదేశాలలో పండ్ల నాణ్యతను, వాటి సాగు గురించి తెలిపేందుకు స్టిక్కర్లను అతికిస్తారని, భారతదేశంలో అలాంటి నిబంధనలేవీ లేవని తెలిపింది.

పండ్లలో లోపాలను కప్పి పుచ్చేందుకు ఇటువంటివి వ్యాపారులు చేస్తున్నారని పేర్కొంది.పైగా స్టిక్కర్లకు వాడే జిగురులో ఉండే రసాయనాలు మన ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేసింది.

అయితే విదేశాలలో పండ్లపై ఉండే స్టిక్కర్లకు చాలా ప్రత్యేకత ఉంది.స్టిక్కర్‌పై 4 అంకెల కోడ్ ఉండే, పండ్ల ఉత్పత్తిలో సాధారణ ఎరువులు, సహజ పురుగు మందులు ఉపయోగించినట్లు అర్ధం.

కోడ్ ఐదు అంకెలు మరియు కోడ్ మొదటి అంకె 8 అయితే, పండు 'జన్యుపరంగా మార్పు చెందినది' అని అర్థం.

ఐదు అంకెల కోడ్ 9తో ప్రారంభమైతే, పండు పూర్తిగా సేంద్రియ పద్ధతిలో పెరిగినట్లు అర్థం.

నాగార్జున విషయంలో ఎందుకిలా జరుగుతుంది…