కొత్తిమీర వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..!

కొత్తిమీర వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే!

మనం ఏదన్నా కూర వండినపుడు మన వంట ఇంట్లో మొదట వెతికేది ఏదన్నా ఉంది అంటే అది కొత్తిమీర మాత్రమే.

కొత్తిమీర వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే!

కూర అయిపోయాక గార్నిష్ చేయాలంటే తప్పకుండా కొత్తిమీర ఉండాలిసిందే.ఒకవేళ కొత్తిమీర లేకపోతే కర్రీ రుచే మారిపోతుంది అని ఫీల్ అవుతాం కదా.

కొత్తిమీర వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే!

అయితే మన అందరికి తెలియని విషయం ఏంటంటే కొత్తిమీర అనేది మన కూరకి రుచిని ఇవ్వడానికి అలాగే గార్నిష్ చేయడానికి మాత్రమే ఉపయోగ పడుతుంది అని అనుకుంటే పొరపాటే.

కొత్తిమీరలో మనకు తెలియని ఎన్నో ఆరోగ్య పరమైన ఉపయోగాలు ఉన్నాయి.వాటి గూర్చి తెలిస్తే కొత్తిమీర ఇంట్లో లేకపోయినా బయట నుంచి తెప్పించి మరి కూరలో వేస్తారు.

కొత్తిమీర వల్ల ఆరోగ్యానికి ఎన్ని ఉపయోగాలో చుడండి మరి.! కొత్తిమీర తినడంవల్ల రక్తపోటు తగ్గుతుంది.

రక్తంలో చక్కెర స్థాయుల్ని తగ్గించే విషయంలో కొత్తిమీర అద్భుతంగా పనిచేస్తుంది.అలాగే ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచడంలో కూడా కొత్తిమీర బాగా పనిచేస్తోంది.

అంతేకాదు కొత్తిమీరలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.అలాగే కడుపులో మంటల వంటివి తగ్గాలంటే కొత్తిమీర వాడాలి.

కాన్సర్ వంటి ప్రాణాంతరకరమైన వ్యాధులు రాకుండా కొత్తిమీర తినాలి.గుండె సంబంధిత జబ్బులు రాకుండా కొత్తిమీర కాపాడుతోంది.

మన మెదడు చాలా సున్నితమైనది.అందుకనే నాడీ వ్యవస్థ దెబ్బతినకుండా ఉండాలంటే కొత్తిమీర కావాలి.

ఇంకో ముఖ్య ఉపయోగం ఏంటంటే ఒత్తిడిని తగ్గించడానికి కొత్తిమీర ఒక మందులాంటిది.టెన్షన్ తట్టుకోవాలంటే కొత్తిమీర తినాలిసిందే.

కొత్తిమీర జీర్ణవ్యవస్థను కాపాడుతుంది.పేగుల్ని శుభ్రంగా ఉంచుతుంది.

మాటిమాటికీ కడుపునొప్పి వచ్చేవాళ్లు, మలబద్ధకంతో బాధపడేవాళ్లు.రోజూ కొత్తిమీర తినాలి.

ఆరోగ్యానికి మాత్రమే కాదు అందానికి కూడా కొత్తిమీర చాలా ఉపయోగపడుతుంది.చర్మంపై దద్దుర్లు, మచ్చలు, మొటిమలు, గాట్లు, దెబ్బలు, గాయాలు ఉంటే కొత్తిమీర తింటే అన్ని మాయం అవుతాయి.

కొత్తిమీర తినడం వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి అన్నమాట.మరి మీ రోజువారీ వంటల్లో కొత్తిమీర ఉపయోగాన్ని పెంచండి మరి.

సూర్య తెలుగు డైరెక్టర్స్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడా..?