ప్రస్తుతం స్టార్ హీరోలకు ధీటుగా ఉన్న స్నేహితుడు ఆర్టిస్ట్.. ఈ నటుడిని గుర్తు పట్టారా?

సినిమా ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా( Child Artist ) గుర్తింపు తెచ్చుకున్న వారు చాలామంది ఉన్నారు.

చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ చాలా సినిమాలలో నటించి గుర్తింపు తెచ్చుకొని ఆ తర్వాత చదువుల నిమిత్తం హీరో హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తూ ఉంటారు.

అలా ఇప్పటికే ఎంతోమంది సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.ప్రస్తుతం చాలామంది ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్టులు హీరో హీరోయిన్లుగా వెండితెరపై రాణిస్తున్నారు.

ఇంకొందరు మాత్రం సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.అటువంటి వారిలో రిన్సన్ సైమన్( Rinson Simon ) ఒకరు.

ఈ పేరు అంతగా తెలియదు.కానీ మిల్లి మీటర్ అంటే మాత్రం ఠక్కున గుర్తు పట్టేస్తారు.

"""/" / కోలీవుడ్ స్టార్ విజయ్ దళపతి( Vijay Thalapathy ) నటించిన స్నేహితుడు సినిమాలో( Snehithudu Movie ) చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించాడు రిన్సన్ సైమన్.

ఈ సినిమాలో తన కామెడీతో నవ్వులు పూయించాడు.ఈ సినిమాలో మిల్లి మీటర్ గా కనిపించిన ఆ కుర్రాడు ఇప్పుడు సెంటి మీటర్ అయ్యాడు.

అప్పట్లో చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించిన ఈ కుర్రాడు ఇప్పుడు హీరోగా మారి ఆశ్చర్యపరుస్తున్నాడు.

1995లో ఆగస్ట్ 4న చైన్నెలో జన్మించిన రిన్సన్ సైమన్ కు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం.

చిన్నప్పుడే లిటిల్ మాస్టర్స్, డ్యాన్స్ రియాల్టీ షో జోడీ నంబర్ 1, సీజన్ 5 వంటి షోలో పాల్గొన్న రిన్సన్ కొరియోగ్రాఫర్ కావాలని ఇండస్ట్రీలో ఆఫర్స్ కోసం ట్రై చేశాడు.

"""/" / అదే సమయంలో 2008లో కళై సినిమాతో కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు.

ఆ తర్వాత పలు సినిమాల్లో కనిపించిన రిన్సన్ 2012లో శంకర్ దర్శకత్వం వహించిన స్నేహితుడు మూవీలో నటించాడు.

2013 వరకు సినిమాల్లో యాక్టివ్ గా ఉన్న రిన్సన్ చివరగా ధనుష్ నటించిన పాండి చిత్రంలో కనిపించాడు.

తాజాగా ఈ కుర్రాడికి సంబంధించిన ఫోటోస్ వైరల్ అవుతున్నాయి.ఆ ఫోటోలపై నెటిజన్స్ అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు.

రిలీజ్ రోజునే గేమ్ ఛేంజర్ హెచ్డీ ప్రింట్.. మూవీ ఇండస్ట్రీని ఈ దరిద్రం వదలదా?