అరెరే ..కాజల్ కి ఏమైంది? ఇలా మారిపోయింది?

అసలు కాజల్ కి ఏమైంది ? ఇటీవల ఆమె పెడుతున్న సోషల్ మీడియా పోస్టులో కాజల్ ను చూసిన వారంతా కూడా ఇదే ప్రశ్న అడుగుతున్నారు.

సినిమా ఇండస్ట్రీలో రారాణీ గా దశాబ్ద కాలంకి పైగా హీరోయిన్ గా చలామణి అయిన కాజల్ ఒక్కసారి సినిమా అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో పెళ్లి చేసుకుని ఒక ఇంటి మనిషి అయింది.

ఇటీవల కాలంలోనే ఒక కుమారుడికి జన్మ ఇచ్చి తల్లిగా కూడా మారింది.ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది కానీ, ఎప్పుడైతే కాజల్ కి పెళ్లి కుదిరిందో అప్పటినుంచి తన మొహంలో అనేక మార్పులు సంభవిస్తున్నాయి.

వయసు మీద పడుతున్న కొద్ది ముఖంలో మార్పులు రావడం చాలా సహజం.కానీ మీరు కాజల్ ని బాగా అబ్సర్వ్ చేయండి, లేదంటే ఈ కిందన ఉన్న పిక్ ని ఒకసారి జూమ్ చేసి చూడండి, తన మొహంలో స్పష్టమైన తేడాలు కనిపిస్తున్నాయి.

పెదాలు ఉబ్బిపోయి ఏదో ప్లాస్టిక్ సర్జరీ ఫెయిల్యూర్ అయిన మనిషిలా కనిపిస్తోంది.వాస్తవానికి కాజల్ పెళ్లి ఫోటోల్లో కూడా కాస్త తేడాగా అనిపించింది.

కాని పెళ్లి హడావిడిలో మేకప్ లో ఏమైనా తేడా కొట్టడం వల్ల అలా కనిపించిందని ఆమె అభిమానులు సరిపెట్టుకున్నారు.

"""/" / కానీ రాను రాను కాజల్ మొహంలో స్పష్టమైన మార్పులు కనిపించడం మొదలయ్యాయి.

ఇక తన కొడుకు పుట్టిన తర్వాత అవి మరి ఎక్కువగా కనిపిస్తున్నాయి.ఇక నిన్నటికి నిన్న రాఖీ సందర్భంగా తన చెల్లితో పాటు భర్తతో కలిసి హడావిడి చేసిన కాజల్, కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ఈ ఫోటోలో కాజల్ ని చూసిన వారంతా కూడా అరే.కాజల్ ఏమైనా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని అధికాస్తా వికటించిందా ? అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు.

మన పక్కింటి అమ్మాయి లాగా ఉండే కాజల్ కాస్త ప్లాస్టిక్ బొమ్మల మారిపోతుంటే కాజల్ అభిమానుల్లోనే కాదు అనేకమంది యువత గుండెల్లో బాణాలు గుచ్చుతున్నంత బాధగా ఉంది.

ఈ కామెంట్స్ తో మీరు కూడా ఏకీభవిస్తున్నారా.అయితే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

గర్ల్‌ఫ్రెండ్ కోసం ఫ్రెండ్‌ని చంపేసిన యువకుడు.. ఎంత సిల్లీ విషయంలో గొడవ వచ్చిందంటే..??