మీరు లిప్ స్టిక్ ని వేసుకోవడానికి ఇష్టపడతారా? అయితే ఇది తెలుసుకోండి..

చాలామంది మహిళలు లిప్ స్టిక్( Lipstick ) వేసుకోవడానికి ఎంతో ఇష్టపడతారు.వర్కింగ్ ఉమెన్ అయినా హౌస్ మేకర్స్ అయినా కచ్చితంగా మహిళల బ్యాగులో లిప్ స్టిక్ ఉంటుంది.

రోజువారి జీవితంలోనే కాకుండా పెళ్లిళ్ల వరకు కూడా తమ పర్సలో లిప్ స్టిక్ ను మాత్రం కచ్చితంగా క్యారీ చేస్తారు మహిళలు.

లిప్ స్టిక్ లలో లిక్విడ్ లిప్ స్టిక్( Liquid Lipstick ) మ్యాట్ లిప్ స్టిక్ ( Matte Lipstick )అని రకాలు కూడా ఉన్నాయి.

అయితే లిక్విడ్ లిప్ స్టిక్ ను వేయడం కష్టం అయినప్పుడు ఈ చిట్కాలు పాటిస్తే చాలు.

"""/" / మొదటిగా లిప్ స్టిక్ ని అప్లై చేసిన తర్వాత పెదవులు పొడిబారకుండా ఉండటానికి పెదాలను హైడ్రేట్ చేయడం చాలా అవసరం.

అందుకే లిప్ స్టిక్ వేసుకునే ముందు పెదాలకు లిప్ బామ్ రాసుకోవాలి.ఇక పది నిమిషాల తర్వాత ఆ లిప్ బామ్ ను తుడపాలి.

ఇలా చేసిన తర్వాత లిప్ స్టిక్ రాసుకుంటే పెదాలు పొడిబారకుండా అందంగా కనిపిస్తాయి.

సాధారణ లిప్ స్టిక్ ల కంటే కూడా లిక్విడ్ లిప్ స్టిక్ ఎక్కువ జిగటుగా కనిపిస్తాయి.

అందుకే లిక్విడ్ లిప్ స్టిక్ ను ఎక్కువగా రాసుకుంటే పెదాల అందం చెడిపోతుంది.

"""/" / అందుకే సాధారణ లిప్ స్టిక్ కంటే తక్కువ లిక్విడ్ లిప్ స్టిక్ వేసుకోవడానికి ప్రయత్నించాలి.

లేదా ముందుగా పెదాలపై రెండు చోట్ల లిప్ స్టిక్ అప్లై చేసి ఆ తర్వాత ఒక బ్రష్ సహాయంతో పూర్తి పెదాలపై అప్లై చేయాలి.

అప్పుడు లైట్ గా అందంగా కనిపిస్తాయి.చాలా మందికి లిప్ స్టిక్ ను అప్లై చేసుకున్న తర్వాత పెదాల పక్కన అంటుకొని ఉంటుంది.

ఇది చూడడానికి మంచిగా అనిపించదు.అందుకే ముందుగా అవుట్ లైన్ చేసిన తర్వాతే లిప్ స్టిక్ ను అప్లై చేయాలి.

అప్పుడు పెదాలు అందంగా కనిపిస్తాయి.

ఆ స్టార్ డైరెక్టర్ తో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రామ్ చరణ్…