NTR : ఎన్టీయార్ దేవర తర్వాత సినిమా ఎవరితో చేస్తున్నాడో తెలుసా..?
TeluguStop.com
యంగ్ టైగర్ ఎన్టీఆర్( Young Tiger NTR ) గా సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి గుర్తింపుని సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్.
ప్రస్తుతం వరుస సినిమాలను చేసే పనులు బిజీగా ఉన్నాడు.వరుసగా పాన్ ఇండియా సబ్జెక్టులను చేస్తూ తనకు తానే పోటీ అనేంత రేంజ్ లో ముందుకు దూసుకెళ్తున్నాడు.
ఇక ఇప్పుడు ఈయన చేస్తున్న దేవర సినిమాతో( Devara Movie ) మరోసారి తన సత్తా ఏంటో చూపించుకోవాలని చూస్తున్నాడు.
ఇక ఈయన ఏ సినిమా చేస్తున్నాడు అని ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా రచ్చ రచ్చ చేస్తున్నారు.
"""/" /
ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఎన్టీఆర్ దేవర సినిమా తర్వాత మరో సినిమా కమిట్ అవ్వలేదు.
ప్రస్తుతం కథలను వింటున్నట్టుగా తెలుస్తుంది.మరి అందులో భాగంగానే తెలుగులో స్టార్ డైరెక్టర్లుగా గుర్తింపు పొందిన సుకుమార్ ( Sukumar )తో గాని లేదా తమిళ్ సినిమా ఇండస్ట్రీకి చెందిన అట్లీ డైరెక్షన్లో( Atlee ) గాని ఒక సినిమా చేసే అవకాశాలు అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది.
మరి ఈ విషయం మీద అఫీషియల్ గా ఇంకా క్లారిటీ అయితే రాలేదు.
ఎన్టీఆర్ కూడా దేవర సినిమా రిజల్ట్ చూసిన తర్వాత మరో సినిమాకి కమిట్ అవ్వాలనే ప్లాన్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది.
"""/" /
అయితే ఈ సినిమాతో పాటుగా ఇప్పుడు వార్ 2 సినిమాలో( War 2 Movie ) కూడా ఎన్టీఆర్ నటిస్తున్నాడు.
కాబట్టి ఇది అది రెండు షూటింగ్స్ అయిపోయి రిలీజ్ అయిన తర్వాత మరో కొత్త సినిమా కమిట్ అవ్వాలని చూస్తున్నాడు.
ఇక సినిమా చేయడంలో లేట్ అయిన పర్లేదు కానీ, ఫెయిల్యూర్ మాత్రం తన ఖాతాలో వేసుకోకూడదనే ఉద్దేశంతోనే ఎన్టీయార్ ఉన్నట్టుగా తెలుస్తుంది.
ఇక ప్రస్తుతం ఎన్టీయార్ ఫోకస్ అంత దేవర సినిమా మీదనే పెట్టినట్టుగా తెలుస్తుంది.
మరి ఈ సినిమాతో సక్సెస్ కొడతాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.