రాత్రి వేళలోనే వారాహి అమ్మవారినీ.. ఎందుకు పూజిస్తారో తెలుసా..?

చాలామంది వారాహిమాతను( Varahi Matha ) రాత్రి వేళలోనే కొలుస్తారు.మన సనాతన ధర్మంలో మహావిష్ణువును ( Lord Vishnu )పూజించడానికి ప్రాంతంకాలమని, శివున్ని పూజించడానికి సాయంకాలమని పురాణాలు చెబుతున్నాయి.

అయితే కొన్ని దేవత ప్రార్ధనలు కొన్ని సమయాల్లో చేయడం వలన దానికి విశేషమైన ఫలితాలు ఉంటాయి.

అయితే వారాహిమాతను రాత్రి సమయంలో పూజించడం వలన ఎన్నో అద్భుతమైన ఫలితాలు ఉంటాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగ కర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ( Brahmashri Chilakamarthi Prabhakara Chakraborty Sharma ) గారు తెలిపారు.

అయితే మన పురాణాల ప్రకారం శక్తి ఉన్న ఏడూ ప్రతిరూపాలే సప్తమాతృకాలు వీరే బ్రాహ్మీ, మహేశ్వరి, కౌమారీ, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి.

అయితే కొన్ని నమ్మకాల ప్రకారం ఎనిమిదో మాతృకగా నారాసింహాని అలాగే మరికొన్ని సాంప్రదాయాలలో తొమ్మిదవ మాతృకగా వినాయకిని ని ఆరాధించడం జరుగుతోంది.

ఇక దుష్ట శిక్షణ కోసము భక్తులను కాచెందుకు ఈ సప్తమాతృకలు సిద్ధంగా ఉంటారు.

పూర్వంలో హిరణ్యక్షపుడు రాక్షసుడిని సహరించి భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణు అవతారమే వరాహమూర్తి( Varaha Murthy ).

అయితే ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీతత్వమే వారాహి అని అంటారు. """/" / ఇక దేవీ భాగవతం మార్కండేయ పురాణం, వరాహ పురాణం లాంటి పురాణాలలో ఈమె ప్రసక్తి కనిపిస్తుంది.

అలాంటి పురాణాలలో అంధకాసురుడు, రక్తబీజుడు, సింహనిశంభులు లాంటి రాక్షసులను సంహరించడంలో ఆమె పాత్ర చాలా స్పష్టంగా కనిపిస్తుంది.

వరాహమూర్తినే వారాహి రూపం కూడా పోలి వుంటుంది.ఈమె శరీర ఛాయను నల్లని మేకవర్ణంలో ఉన్నట్లు పేర్కొన్నారు.

"""/" / 8 చేతులతో కనిపిస్తుంది.అలాగే అభయ వరద హస్తాలతో శంఖము, పాశము, హలమూ లాంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది.

అలాగే గుర్రము, సింహము, పాము, దున్నపోతులాంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తుంది.

ఇక వారాహి మాత తాంత్రికులకు ఇష్టమైన దేవత.అందుకే ఈమెను కేవలం రాత్రి వేళలో మాత్రమే ఎక్కువగా పూజిస్తారు.

ఇక వారాహిమాత ముఖ్యదేవతగా ప్రతిష్టించిన కొన్ని ఆలయాలలో దర్శనం కూడా రాత్రివేళలోనే అలాగే తెల్లవారుజామున సమయంలోను మాత్రమే చేస్తారు.

పుష్ప కేశవ పాత్రలో ఆ హీరో చేయాల్సి ఉంది.. వైరల్ అవుతున్న సుకుమార్ కామెంట్స్!