ఊర్మిళా దేవి 14 సంవత్సరాలు ఎందుకు నిద్రపోయిందో తెలుసా?

లక్ష్మణుడి భార్యగా మనకు తెలిసిన ఊర్మిళా దేవి గురించి ఇంకా చాలా విషయాలు మనకు తెలియవు.

అందులో కొన్ని.ఆమె తండ్రి జనకుడని.

శ్రీరామ చంద్రుడి భార్య అయిన సీతాదేవికి ఊర్మిళా దేవి సొంత చెల్లెలు.జనకుడి రెండో కూతురు.

అంతే కాదండోయ్ శ్రీరామ చంద్రుడు శివ ధనుర్భంగం చేసి సీతా దేవిని పెళ్లి చేసుకున్న తర్వాత… జనకుడు తన రెండో కూతురు అయిన ఊర్మిళా దేవిని.

లక్ష్మణుడికి ఇచ్చి వివాహం జరిపించాడు.ఈ తర్వాత సీతా రామ లక్ష్మణులు వన వాసానికి పోయినన్ని రోజులు… ఊర్మిళా దేవి నిద్రపోయిందని చెబుతుంటారు.

దాదాపు 14 సంవత్సరాలు నిద్ర పోవడం అంటే చిన్న విషయం ఏమీ కాదు.

కానీ ఆమె అన్ని రోజులు ఎందుకలా నిద్ర పోయిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

సీతా రాములతో లక్ష్మణుడు కూడా వన వాసాలకు పోయిన విషయం మనందరికీ తెలిసిన విషయమే.

వనవాస సమయంలో లక్ష్మణుడు.శ్రీరామ సంరక్షణార్థం నిద్ర పోకుండానే ఉండిపోయాడట.

"""/" / ప్రతి రోజూ అంటే 14 సంవత్సరాల పాటు లక్ష్మణుడు నిద్ర పోకుండానే ఉన్నాడట.

భర్త నిద్ర పోకుండా ఉండటం వల్ల… ఆయనలో సగ భాగం అయినా ఊర్మిళా దేవి ఈ 14 సవంత్సరాల కాలం నిద్రపోయిందని పురాణాలు చెబుతున్నాయి.

అంతే కాదండోయ్ ఈ కాలంలో ఎక్కువ సేపు నిద్రపోయే వారిని ఊర్మిళా దేవితో పోలుస్తారు.

లక్ష్మణుడు అయోధ్యకు తిరిగొచ్చే వరకూ ఊర్మిళా దేవి పడుకునే ఉందట.

బిగ్ బాస్ షోలో వచ్చిన రోజే ఎలిమినేట్.. ఇలా చేయడం మరి దారుణం అంటూ?