Tirumala Venkateswara Swamy : తిరుమల వెంకటేశ్వర స్వామి కళ్ళు ఎందుకు మూసి ఉంచుతారో తెలుసా..?

విభిన్న విశ్వాసాలకు సంప్రదాయాలకు పేరుగాంచిన అనేక ప్రసిద్ధ దేవాలయాలు మనదేశంలో ఎన్నో ఉన్నాయి.

అలాంటి దేవాలయాల్లోనే తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం( Tirupati Sri Venkateswara Swamy Temple ) కూడా అత్యంత ప్రసిద్ధి చెందిన దేవాలయాలలో ఒకటి.

ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందినది.తిరుపతి బాలాజీ ఆలయాన్ని కలియుగ వైకుంఠంగా పిలుస్తారు.

వెంకటేశ్వర స్వామిని శ్రీనివాస, బాలాజీ, గోవిందా అనే పేర్లతో భక్తులు పిలుస్తూ ఉంటారు.

అయితే ఈ ఆలయానికి లక్షలాది మంది భక్తులు బాలాజీని దర్శించుకోవడానికి తరలివస్తూ ఉంటారు.

"""/" / కొలసిన వారికి కొంగుబంగారమై, భక్తుల కోరికలు తీర్చే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అని చెప్పవచ్చు.

తిరుపతి బాలాజీ, విష్ణుమూర్తి( Tirupati Balaji, Vishnumurthy ) అవతారమని ఆయన కలియుగంలో ఉన్నంతకాలం కలియుగం అంతం కాదని భక్తుల నమ్మకం.

అయితే ఏడుకొండల పై వెలసిన వెంకన్న కన్నులు ఎప్పుడు మూసి ఉంటాయని వినే ఉంటారు.

అసలు దీనికి కారణమేమిటి? ఎందుకు తిరుపతి బాలాజీ కళ్ళు మూసి ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

తిరుపతి దేవస్థానాన్ని కలియుగంలో వెంకటేశ్వరుని నివాసంగా పరిగణిస్తారు.ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి జిల్లాలోని తిరుమలలో ఉంది.

"""/" / శ్రీహరి అవతారమైన వెంకటేశ్వరుడి శక్తివంతమైన, ప్రకాశవంతమైన కళ్ళను ఎప్పుడు మూసి ఉంచుతారు.

ఎందుకంటే ఆయన భక్తులు వెంకటేశ్వర స్వామి కళ్ళలోకి నేరుగా చూడలేరు.ఆయన కళ్ళు విశ్వశక్తికి మించినవి అని పండితులు చెబుతున్నారు.

ఈ కారణంగానే శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్ళు మూసి ఉంచుతారని పండితులు చెబుతున్నారు.

అలాగే ఒక్క గురువారం మాత్రం వెంకటేశ్వర స్వామి కన్నుల ముసుగును మారుస్తారు.ఆ సమయంలో మాత్రమే భక్తులు వెంకటేశ్వరుని నేత్రాలను ఒక్క క్షణం చూడగలరు.

డాక్టరమ్మతో ఏడడుగులు వేసిన పుష్ప విలన్ జాలి రెడ్డి…ఫోటోలు వైరల్!