వీరికి ఉప్పు దానం ఇవ్వకూడదని ఎందుకు అంటారో తెలుసా..?
TeluguStop.com
మన భారతీయులకు ఎన్నో రకరకాల నమ్మకాలు ఉంటాయి.ముఖ్యంగా హిందూమతంలో చాలా రకాల ఆచారాలను, సాంప్రదాయాలను, వాస్తు( Vastu )లను పాటిస్తూ ఉంటారు.
అయితే హిందూ మతంలో కూడా చాలామంది ఒక్కొక్కరు ఒక్కొక్క సాంప్రదాయాన్ని పాటిస్తూ ఉంటారు.
ఎందుకంటే హిందువులకు చాలా విశ్వాసాలు ఉంటాయి.అలాంటి వాటిలోనే కొన్ని పదార్థాలు కొందరి చేతికి ఇవ్వకూడదన్న విశ్వాసాలు కూడా చాలా ఉన్నాయి.
అందులోనే ఒకటి ఉప్పును పక్క వారికి ఇవ్వకూడదని చెబుతూ ఉంటారు.సాధారణంగా ఉప్పు డబ్బాను ఎదుటి వ్యక్తికి ఇచ్చే సమయంలో నేరుగా చేతికి ఇవ్వకూడదని చెబుతారు.
"""/" /
అయితే ఉప్పును నేరుగా ఎందుకు ఇవ్వకూడదు? దీని గురించి హిందూ ధర్మం ఏం చెబుతుందన్న విషయం ఇప్పుడు తెలుసుకుందాం.
మనం దానం చేసే దశ దానాల్లో ఉప్పు కూడా ఒకటి.ఇక ఉప్పుని పితృదానాల్లో, శనిదానాల్లో దానం చేస్తూ ఉంటారు.
కాబట్టి పూజల దగ్గర ఉప్పుని దూరంగా ఉంచుతారు.అంతేకాకుండా దుష్టశక్తులు పోతాయని దిష్టి తీయడానికి ఉప్పుని ఉపయోగిస్తూ ఉంటారు.
అంతేకాకుండా ఉప్పు అందించడం వలన ఒకరి రహస్యాన్ని మరొకరికి చెప్పడమే అని అర్థం.
కాబట్టి ఉప్పు చేతికి అందిస్తే గొడవలు జరుగుతాయని, ఉప్పు చేతుల్లోకి అందుకునే వారిపై శని ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుందని అందరూ నమ్ముతూ ఉంటారు.
"""/" /
ఇక పురాణాల ప్రకారం చెప్పుకుంటే అమృతం కోసం చేసిన సాగర మధనం సమయంలో సముద్ర గర్భం నుండి లక్ష్మీదేవి ( Lakshmi Devi )ఉద్భవిస్తుంది.
అదే సముద్ర గర్భం నుంచి ఉప్పు కూడా తయారవుతుంది.కాబట్టి ఉప్పుని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు.
ఇక జీవితంలో ఆర్థిక కష్టాల నుండి బయట పడాలంటే ఉప్పుతో పరిహారాలు చేయాలని కూడా నిపుణులు సూచిస్తూ ఉంటారు.
మరి ముఖ్యంగా జ్యేష్టా దేవి( Jyeshta Devi )ని వదిలించుకునేందుకు ఉప్పుతో పరిహారాలు చేయాలి.
అందుకే ఈ ఉప్పును ఎవరి చేతి నుంచి అయినా అందుకుంటే వారి చెడు మీకు సంక్రమిస్తుందని విశ్వాసం.
కాబట్టి ఎప్పుడూ ఉప్పు చేతికి ఇవ్వకూడదు.
వయస్సు 69.. లుక్స్ మాత్రం 29.. చిరంజీవి లేటెస్ట్ లుక్స్ చూస్తే మాత్రం షాకవ్వాల్సిందే!