ఎంతో పవిత్రమైన ఈ వస్తువులను పొరపాటున కూడా కింద పెట్టకూడదు.. ఎందుకో తెలుసా?

మన హిందూ ధర్మశాస్త్రం ప్రకారం ఎన్నో వస్తువులను ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు.హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం ప్రతి ఒక్కటి కూడా ఎంతో సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం చేయాల్సి ఉంటుంది అయితే చాలా మందికి ఇలాంటి పద్ధతులు తెలియక ఇలాంటి విషయాల గురించి పట్టించుకోవడం లేదు.

ఈ క్రమంలోనే హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులను ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు అలాంటి వస్తువులను ఎప్పుడు కూడా అశుభ్రమైన ప్రదేశాలలో కానీ, మన ఇష్టానుసారంగా కానీ పెట్టకూడదు.

మరి అలా కింద పెట్టకూడని వస్తువులు విషయానికి వస్తే పసుపు కుంకుమ పువ్వులు టెంకాయలు వంటి పూజకు ఉపయోగించే వస్తువులను కింద పెట్టకూడదని పండితులు చెబుతున్నారు.

అయితే కేవలం ఈ వస్తువులు మాత్రమే కాకుండా మరికొన్ని వస్తువులు కూడా కింద పెట్టకూడదు.

మరి ఆ వస్తువులు ఏమిటి అనే విషయానికి వస్తే.h3 Class=subheader-styleజంధ్యం/h3p: సాధారణంగా హిందువులలో చాలా మందికి జంధ్యం ధరించే సంప్రదాయం ఉంటుంది.

ఎంతో పవిత్రమైన ఈ జంధ్యాన్ని ఎప్పుడూ కూడా కింద పెట్టకూడదు.జంధ్యాన్ని గురువు తల్లిదండ్రులతో సమానంగా భావిస్తారు కనుక దానిని కింద పెడితే వారిని అవమానించినట్లే అని భావిస్తారు.

H3 Class=subheader-style సాలిగ్రామం:/h3p సాలి గ్రామాన్ని సాక్షాత్తు విష్ణువు ప్రతిరూపంగా భావిస్తారు.కనుక ఎంతో పవిత్రమైన సాలగ్రామాన్ని కింద పెట్టడం వల్ల అనేక సమస్యలు వెంటాడతాయి.

"""/"/ H3 Class=subheader-styleదీపం:/h3p దీపారాధన చేసిన తర్వాత ఆ దీపాన్ని పొరపాటున కూడా నేలపై పెట్టకూడదు.

ఇలా దీపాన్ని ఏ ఆధారం లేకుండా పెట్టడం వల్ల ఆ దేవుడు కూడా మనకు ఎలాంటి ఆధారం చూపడని భావిస్తారు.

అందుకోసమే దీపం వెలిగించేటప్పుడు కింద ఏదైనా ప్లేట్ లేదా ఆకును ఆధారంగా ఉంచాలి.

H3 Class=subheader-styleబంగారం:/h3p బంగారాన్ని సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తారు కనుక బంగారాన్ని నేలపై పెట్టడం వల్ల సాక్షాత్తు లక్ష్మీదేవి అవమానించినట్లే అని భావిస్తారు.

అందుకోసమే బంగారాన్ని కూడా ఎలాంటి పరిస్థితులలో కింద పెట్టకూడదని పండితులు తెలియజేస్తున్నారు.

Hero Naveen Polishetty : రోడ్డుప్రమాదంలో హీరో నవీన్ పొలిశెట్టికి గాయాలు..!