గవ్వలను లక్ష్మీదేవి సోదరులుగా ఎందుకు భావిస్తారో తెలుసా?

మన హిందూ సాంప్రదాయం ప్రకారం గవ్వలను పూజించడం ఆనవాయితీగా వస్తుంది.అయితే గవ్వలను సాక్షాత్తు లక్ష్మీదేవికి సోదరీ, సోదరులు గా భావిస్తారు.

అందువల్ల మనం గవ్వలను పూజించడం ద్వారా సాక్షాత్తు లక్ష్మీ దేవిని పూజించిన ఆహ్వానించినట్లలేనని విశ్వసిస్తారు.

పురాణాల ప్రకారం లక్ష్మీదేవి సముద్రుడు కూతురని, అందులో లభించే టటువంటి గవ్వలు లక్ష్మీదేవికి చెల్లెలుగా, శంకువులు తమ్ముడు లాగా భావిస్తారు.

అయితే ఈ గవ్వలను పూజించడం ద్వారా ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం.

గవ్వలు లక్ష్మీదేవికి సోదరిగా భావించి మన పూజ గదిలో లక్ష్మీ దేవి పీఠం దగ్గర పెట్టి పూజించడం ద్వారా మన ఇంట్లోకి సాక్షాత్తు లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది.

పూజించిన గవ్వలను మనం డబ్బు పెట్టే లాకర్ లో ఉంచడం ద్వారా ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందుతారు.

గవ్వల లో మనకు వివిధ రకాలుగా కనిపిస్తూ ఉంటాయి.అయితే వాటిలో పసుపు వర్ణంలో ఉన్న గవ్వలను లక్ష్మీదేవి గవ్వలు గా భావించి పూజిస్తారు.

ఈ గవ్వలను నల్లటి త్రాడు లో వేసి చిన్న పిల్లల మెడలో కట్టడం ద్వారా వారికి ఎటువంటి నరదృష్టి కానీ, దుష్టశక్తుల పీడ కాని కలగదు.

పసుపు రంగు బట్టలో గవ్వలను కట్టి వాహనాలకు కట్టడం ద్వారా ఎటువంటి ప్రమాదాలకు దారితీయదు.

అంతేకాకుండా కొత్తగా నిర్మించేటువంటి గృహాలకు గవ్వలను కట్టడం వల్ల మన ఇంట్లోకి సాక్షాత్తు లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లే.

దీపావళి పండుగ రోజు ఇంట్లో లక్ష్మీదేవి పూజను నిర్వహించి, గవ్వలను ఆడటం ఆనవాయితీగా వస్తోంది.

అలా గవ్వలను ఆడటం ద్వారా గవ్వలు చేసే సవ్వడికి లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశిస్తుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతారు.

వ్యాపారం చేసే వారు, వారి వ్యాపార అభివృద్ధి కోసం గల్లా పెట్టెలో గవ్వలను ఉంచడం ద్వారా వారి వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలులా జరుగుతుందని విశ్వసిస్తారు.

అందువల్ల వారు డబ్బు పెట్టే పెట్టెలో గవ్వలను ఉంచుకుంటారు.ఇంతటి ప్రాముఖ్యత కలిగి ఉండడం వల్ల మన హిందువులు గవ్వలను పూజిస్తున్నారు.

ఉల్లిగడ్డ పంటను నాటుకునే విధానం.. కలుపు నివారణకు చర్యలు..!