సరయు నది మహాశివుని శాపానికి.. ఎలా గురైందో తెలుసా..?
TeluguStop.com
ఉత్తరాఖండ్‌లో ఉద్భవించి ఉత్తరప్రదేశ్ గుండా ప్రవహించే సరయు నదికి( Sarayu River ) శారదా నది ఉపనది అని దాదాపు చాలా మందికి తెలుసు.
సరయు బీహార్ లోని రావెల్గంజ్ వద్ద గంగా నదిలో కలుస్తుంది.హిందూ ధర్మంలో నదులను ఎంతో పవిత్రమైనవిగా భావిస్తారు.
గంగా నదికి ఉపనది అయినా సరయు నది గురించి దాదాపు చాలామందికి తెలుసు.
ఉత్తరాఖండ్‌లో( Uttarakhand ) జన్మించిన సరయు నది ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య ను( Ayodhya ) అనుకుని ప్రవహిస్తూ ఉంది.
అయోధ్య శ్రీరాముని జన్మస్థలం.ఈ నదిలో స్నానం చేసిన వారి పాపాలు నశిస్తాయని పండితులు చెబుతున్నారు.
అయితే దీని వెనుక ఉన్న పురాణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. """/" /
రామాయణంలో సూచించినట్లుగా సరయు నది పవిత్రమైనది.
అయినప్పటికీ ఈ నది మహా శివుని( Maha Shiva ) చేత శపించబడింది.
అందువల్ల ఈ నది పవిత్రమైన శాపగ్రస్తమైనది.పురాణాల ప్రకారం విష్ణు అవతారమైన శ్రీరాముడు( Sri Rama ) తన అవతారం చలించే సమయంలో సరయు నదిలో జల సమాధి అయ్యి తన జీవితాన్ని ముగించాడు.
దీని కారణంగా శివయ్యకు సరయు నది పై చాలా కోపం వచ్చింది.అప్పుడు సరయు నది నీటిని ఏమాత్రం పవిత్ర కార్యాలకు, దేవాలయంలో నైవేద్యానికి ఉపయోగించకూడదని,అలాగే ఈ నీటిని పూజలో కూడా ఉపయోగించకూడదని శపించాడు.
"""/" /
తనకు శివయ్య ఇచ్చిన శాపం విన్న వెంటనే సరయు మాత శివయ్య పాదాలపై పడి ప్రభువు ఇందులో నా తప్పు ఏమిటి రాముడి అవతార సమాప్తి ఈ విధంగా జరగాలనేది ఎప్పుడో నిర్ణయించబడింది.
ఇందులో నేను చేసిన నేరం ఏమిటి అని శివయ్యను అభ్యర్థించింది.సరయు దేవి చేసిన అభ్యర్థనను విన్న శివయ్య తను ఇచ్చిన శాపాన్ని తిరిగి తీసుకోలేనని చెప్పాడు.
అలాగే శాప ఉపశమనం చెప్పాడు.సరయు నది నీటిలో స్నానం చేయడం వల్ల ప్రజల పాపాలు కడిగివేయబడతాయి.
అయితే నది నీరు పూజలకు, దేవాలయాలలో అర్చనకు ఉపయోగించిన ప్రతిఫలం లభించదు.అదే సమయంలో పాపం కూడా కాదు అని మహా శివుడు చెప్పాడు.
అందుకనే అప్పటినుంచి సరయు నది నీటిని ప్రార్థనా, పూజ సమయంలో ఉపయోగించరు.
‘హరిహర వీరమల్లు’ సినిమా మీద హైప్ పెంచుతున్నారా..?