రేపటి నుంచి ప్రారంభమయ్యే రోహిణి కార్తే కు రోళ్లు పగులుతాయని ఎందుకంటారో తెలుసా..?
TeluguStop.com
రోహిణి కార్తె( Rohini Karte ) రేపటి నుంచి మొదలవుతుంది.అంటే ఎండలు ఇంకా పెరుగుతాయని పెద్దవారు చెబుతూ ఉంటారు.
రోహిణి కార్తెలో ఎండలకు రోళ్లు పగులుతాయని పూర్వం ప్రజలు చెబుతూ ఉండేవారు.నిజమే మరి ఈ నాలుగు నెలల ఎండాకాలంలో( Summer ) ఎండలు తొలి రోజుల్లో కొద్ది కొద్దిగా పెరిగి, ఉగాది నుంచి వేడి తాపం పెరుగుతుంది.
ఎండాకాలం చివరి దశలో రోళ్లు పగిలేలా ఎండలు ఉంటాయని పూర్వం ప్రజలు చెప్పేవారు.
మామూలుగా ఉండే ఎండల వేడిని తట్టుకోలేమంటే ఎండాకాలంలో చివరి కార్తె అయినా రోహిణిలో ఎండలు ఇంకా ఎక్కువగా ఉంటాయి.
"""/" /
మరి ఈ ఏడాది రోహిణి కార్తె ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ సంవత్సరం రోహిణి కార్తె మే 25న మొదలై జూన్ 8 వరకు ఉంటుంది రోహిణి కార్తె ఫలితం ఈ పక్షం రోజులు అధిక వేడి గాలులు, ఎండ తీవ్రతలు, అగ్ని ప్రమాదాలు, ఉక్కపోతలు ఉంటాయి.
ఎండ తీవ్రతకు శరీరం అలసిపోతుంది.కాబట్టి ఈ ఆరోగ్య రిత్యా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
ఎక్కువగా మట్టి కుండా నీరు త్రాగడం, మజ్జిగ, పండ్ల రసాలు, కొబ్బరినీళ్లు, నిమ్మరసం, రాగి జావా లాంటివి త్రాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది.
"""/" /
మసాలాలకు సంబంధించిన ఆహార పదార్థాలను తీసుకోకపోవడమే మంచిది.నీరు సౌకర్యంగా ఉన్నవారు తప్పకుండా రెండు పూటల స్నానం చేయాలి.
అన్ని రకాల వయసు వారు ఎక్కువగా కాటన్ దుస్తులు ధరించడమే మంచిది.చిన్నపిల్లలకు మీరు ఉండే ఇంటి ఉష్ణోగ్రత తీవ్రతను( Temperature ) బట్టి తడిగుడ్డతో తుడిచి బట్టలు మార్చాలి.
అలాగే ఈ భూమిపై ఉన్న నోరులేని జీవులకు చల్లని ప్రదేశంలో త్రాగడానికి నీటిని ఏర్పాటు చేయడం, ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో నడిచి వెళ్లే ప్రజలకు త్రాగడానికి నీరు ఏర్పాటు చేయడం వల్ల మీకున్న గ్రహ దోషాలు కూడా దూరం అయిపోతాయి.
ఇవాంకా ట్రంప్ ఫైట్ వీడియో లీక్.. ఎవరితోనో తెలిస్తే నోరెళ్లబెడతారు..?