కొత్త ఇంట్లో పూజలు ఎందుకు చేస్తారో తెలుసా..
TeluguStop.com
భారతదేశంలో చాలా మంది ప్రజలు కొత్త ఇంట్లోకి చేరేటప్పుడు లేదా ప్రవేశించేటప్పుడు పూజలు, హోమాలు చేస్తూ ఉంటారు.
ఇలాంటి కొన్ని ఆచారాలు కాలంతో పాటు మారుతూ వస్తున్నాయి.అయినా కూడా కొంతమంది ప్రజలు మాత్రం ఈ ఆచరణను పాటిస్తూనే వస్తున్నారు.
అయితే భారతీయ ఋషులు ప్రకృతిని పరిశోధించి అందాన్ని అజ్ఞాతశక్తిని కనుగొంటూ వస్తున్నారు.శక్తికి రూపం లేదు అని తెలుసు మనకు కానీ అది పనులు చేస్తుంది.
అంతేకాకుండా ఆ పనులు ఫలితాలను కూడా ఇస్తాయి.సూర్యుని శక్తిని సోలార్ ప్లేట్లలో నిక్షిప్తం చేసి కరెంట్ గా మనం ఈ సమాజంలో ఉపయోగిస్తూ ఉన్నాం.
అలాంటి శక్తి నిజాయితీ, స్వార్థపు ఆలోచనలు లేని సాధువులు, స్వామీజీలు అంతరంగాలలో నెలకొని ఉంటుంది.
అంతే కాకుండా ఆ ప్రాణ కాంతి విశ్వశక్తి, సద్భావన నరములు ఆ చేతి వేళ్ల చివరి కోసల నుంచి ఉద్భవిస్తూ ఉంటుంది.
దాని ద్వారా కలిగే ప్రేరణ వారి భావనాలు మరియు మన మనసులను మానసిక మలిన రహితలను చేస్తుంది.
ఇలాంటి వాటిలో ఎక్కువగా నమ్మకమే ముఖ్యం.ఈ రోజుల్లో అలాంటి మహాశక్తి గల ఋషుల వారసులు ఈ భూమి మీద లేరేమో కానీ సద్భావన పరుల సంకల్పం మనం బాగుపడాలనే వారి మాట తప్పకుండా ఆ ఇంటి కుటుంబ సభ్యుల మార్గాన్ని ఆటంకాలు లేకుండా చేస్తుంది.
/br """/"/
మనిషి వెన్నుపాము చివరి మూలాధారంలో అలాంటి గొప్ప శక్తి దాగి ఉందని చాలామందికి తెలియదు.
దానిని యోగ సాధన తో సాధించన్నదే మన ఋషుల ఆవిష్కరణ అలా మహాత్ముల చేత మన ఇంట్లో పూజలు చేయించి వారి దీవెనలు పొందాలన్నది మన పూర్వికులు ఎప్పటినుంచో చెబుతున్నారు.
కాబట్టి అదే ఆనవాయితీగా సాంప్రదాయంగా ఆచారంగా ఇప్పటి ప్రజలు కూడా కొనసాగిస్తున్నారు.
యూకేలో విషాదం .. రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్ధి దుర్మరణం