గర్భిణీ మహిళలు పుస్తకాలు చదవాలని మంత్రాలను పఠించాలని ఎందుకు చెబుతారు తెలుసా..?
TeluguStop.com
గర్భిణీ మహిళలు సుందరకాండ, రామాయణం ( Ramayana )వంటి ఇతిహాసాలు చదవాలని పండితులు చెబుతున్నారు.
పురాణ ఇతిహాసాలు చదివితే మానసికంగా, శరీరకంగా దృఢంగా ఉన్న పిల్లలు జన్మిస్తారని చెబుతున్నారు.
సుందరకాండ చదివితే పిల్లలకు చాలా మంచిదని కూడా పెద్దవారు చెబుతూ ఉంటారు.రామాయణంలో ఒక అధ్యాయమైన సుందరకాండలో హనుమంతుని సాహసాలు ఆయన నిస్వార్థత, బలం, శ్రీరాముని పట్ల భక్తి గురించి ఉంటుంది.
ఇవి చదివితే మానసికంగా దృఢత్వం కలిగిన పిల్లలు పుడతారని పెద్దవారు ఎప్పుడు సూచిస్తూ ఉంటారు.
"""/" /
గర్భధారణ సమయంలో పుస్తకాలు చదవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
ముఖ్యంగా చెప్పాలంటే పుస్తకాలు చదవడం వల్ల ఒత్తిడి( Stress ), ఆందోళనలు తగ్గిపోతాయి.
పుస్తక పఠనం రక్తపోటు, హృదయ స్పందన రేటును తగ్గిస్తుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.
ఇది మానసిక స్థితిని మెరుగుపరిచే ఎండార్పిన్లను విడుదల చేస్తుంది.పుస్తక పఠనం నిద్ర నాణ్యతను మెరుగుపరచడానికి, అలసటను తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
గర్భధారణ సమయంలో ఎదురయ్యే సవాళ్ల గురించి కూడా తెలుసుకోవచ్చు.ఇతరుల అనుభవాల గురించి చదవడం ద్వారా గర్భం, ప్రసవం యొక్క వివిధ దశల గురించి, అలాగే పిల్లలను పెంచడంలో సవాళ్ల గురించి తెలుసుకోవచ్చు.
ప్రసవం జరిగినప్పుడు మరింత సన్నద్ధతతో తక్కువ ఒత్తిడితో ఉండవచ్చు.</br """/" /
ఇంకా చెప్పాలంటే మంత్రాలను పవిత్రమైనవిగా చాలామంది ప్రజలు భావిస్తారు.
మంత్రాలు మనస్సును శాంత పరచడానికి శక్తివంతమైన మార్గంగా ప్రజలు పరిగణిస్తారు.మంత్రాలు పఠించడం వల్ల సానుకూల ప్రకంపనలు విడుదలై అవి గర్భంలోని శిశువుకు ఎంతో మేలు చేస్తాయని పండితులు చెబుతున్నారు.
అంతేకాకుండా శిశువు మానసిక అభివృద్ధిని ప్రోత్సహించడంలో ఎంతగానో ఉపయోగపడతాయి.మంత్రలను ( Mantras )పఠించడం ఒత్తిడిని, ఆందోళనను తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.
అలాగే నాణ్యమైన నిద్రలో అందిస్తుంది.ఇంకా చెప్పాలంటే ఒత్తిడి ఆందోళన దూరమవుతుంది.
మెరుగైన నిద్ర అందుతుంది.భావోద్వేగ శ్రేయస్సు మెరుగుపడుతుంది.
అలాగే శిశువుతో మెరుగైన బంధం ఏర్పడుతుందని పండితులు చెబుతున్నారు.
ఇంటర్నెట్‌ని ఊపేస్తున్న ఎగిరే కారు.. ఇండియన్ రోడ్ల కోసమే తయారు చేశారట..?