మన హిందూ పురాణాల ప్రకారం నవ గ్రహాలను పూజించడం ఒక సాంప్రదాయంగా వస్తుంది.
ఏదైనా శుభకార్యాలు జరిగేటప్పుడు లేదా కొత్త ఇంటి నిర్మాణ పనులు చేసే ముందు నవగ్రహాల శాంతి జరిపించమని చాలామంది చెబుతుండడం వినే ఉంటాం.
అదేవిధంగా ఆలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ నవగ్రహాలకు పూజలు చేస్తుంటారు.కొందరిలో వివాహం ఆలస్యం అవుతుందా లేదా మాటిమాటికీ చెడు సంఘటనలు జరుగుతుంటే అటువంటివారు నవగ్రహాల శాంతి చేయించడం చూస్తుంటాము.
అసలు ఈ నవగ్రహాల శాంతి పూజ ఎందుకు చేస్తారో ఇక్కడ తెలుసుకుందాం.మన జీవితంలో ఏర్పడే విజయాలు, అపజయాలు వెనక గ్రహస్థితులు ఉంటాయని భావిస్తున్నాము.
గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడే మన జీవితంలో అన్ని సవ్యంగా జరుగుతాయని, గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు ఒడిదుడుకులు ఎదురౌతాయని చెబుతుంటారు.
ఇలాంటి సమయంలోనే గ్రహాల అనుకూలతకు చేస్తుంటారు. """/" /
మన ఇంట్లో కుటుంబ సభ్యుల ఆరోగ్యం, ఆయుష్షు, సంపదలు కలగాలంటే నవగ్రహ యజ్ఞాన్ని తప్పకుండా పాటించాలి.
మన విశ్వంలో 9 గ్రహాలు ఉన్నాయనే సంగతి మనకు తెలిసిందే.ఈ నవగ్రహాలను ఆయా మంత్రములతో మండలముపై ఆవాహనము చేసి పూజించి, పంచామృతములతో అభిషేకం చేయాలి.
నైవేద్యములు, తాంబులాది ఉపచారము అర్పించి, తరువాత అగ్ని ప్రతిష్టాపనం చేసి సమిథులతో 108 సార్లు కానీ 28 సార్లు గాని హోమం చేసి ఆ నవ గ్రహాలకు సంబంధించిన ధాన్యాలను సమర్పించడం, అదేవిధంగా పురోహితులకు దాన, దక్షిణ తాంబూలములు సమర్పించుకోవడం ద్వారా నవగ్రహాల శాంతి కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
ఉగాది పూజలో మెరిసిన చిరంజీవి మనవరాలు.. వైరల్ అవుతున్న క్లీంకార ఫోటోలు!