Ramadan Fasting : రంజాన్ మాసంలో ముస్లింలు ఖర్జూరం తిని ఉపవాసాన్ని ఎందుకు విరమిస్తారో తెలుసా..?
TeluguStop.com
ముఖ్యంగా చెప్పాలంటే ముస్లింల పవిత్ర మాసం రంజాన్( Ramzan ) మొదలైంది.ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం ప్రజలు ఒక నెల పాటు ఉపవాసంతో అనేక నియమాలను పాటిస్తూ ఉంటారు.
ఉపవాసం( Fasting ) ఉదయం సూర్యోదయనికి ముందు మొదలై, సూర్యాస్తమయం తర్వాత ముగుస్తుంది.
ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి సంప్రదాయాన్ని చాలా మంది ప్రజలు పాటిస్తారు.ఇప్పుడు రంజాన్ ఉపవాస సమయంలో నీళ్లు కూడా తాగడం లేదు.
అలా సాయంత్రం అయ్యేసరికి ప్రార్థన ముగించుకుని ఖర్జూరం( Dates ) తిన్న తర్వాతే ఉపవాస దీక్ష విరమిస్తారు.
ఇంతకీ ముస్లింలు ఖర్జూరం తిని ఉపవాసం ఎందుకు విరమిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.ముస్లింలు తమ ఉపవాసం కోసం ఖర్జూరాన్ని ఉపయోగించడానికి ముఖ్యమైన కారణం ఉంది.
"""/" /
రంజాన్ సందర్భంగా ముస్లింలు తెల్లవారు జామున నుంచి సూర్యాస్తమయం వరకు ఆహారం మరియు నీరు తీసుకోకుండా ఉంటారు.
రోజంతా ఉపవాసం ఉండడం వల్ల వారు అలసట మరియు శక్తి లోపానికి గురవుతారు.
కానీ ఖర్జూరాలు ప్రోటీన్ తో నిండి ఉంటాయి.ఇది శరీరానికి త్వరగా శక్తిని అందిస్తుంది.
అదనంగా ఖర్జూరంలో ఫైబర్, ఐరన్ కంటెంట్, సోడియం మరియు పొటాషియం ఎక్కువగా ఉంటాయి.
ఇది ఆహారం లేకుండా కడుపులో పేరుకుపోయే గ్యాస్ మరియు ఆమ్లా స్థితిని తక్షణమే దూరం చేస్తుంది.
అందువల్ల వారు ఖర్జూరం మరియు నీటితో తమ ఉపవాసాన్ని విరమిస్తారు. """/" /
ఇది మాత్రమే కాకుండా మహమ్మద్ ప్రవక్త ఉపవాసం విరమించడానికి ఖర్జూరాలను తీసుకున్నారని పవిత్ర ఖురాన్ లో( Holy Quran ) ప్రస్తావన ఉంది.
అంతే కాకుండా శరీర ఆరోగ్యం కోసం ఉదయం 7 ఖర్జూరాలు తినాలని మరియు నిద్రపోవడానికి ముందు కూడా తినాలని ప్రవక్త బోధించారు.
ఎందుకంటే ఖర్జూరాలు ఒక వ్యక్తి అనారోగ్యం బారిన పడకుండా రక్షిస్తాయి.కాబట్టి ముస్లింలు ఖర్జూరం తినడం ద్వారా ఉపవాసాన్ని విరమిస్తారు.
అలాగే పండ్ల రసలు, పండ్లు వివిధ రకాల వంటకాలు తీసుకుంటూ ఉపవాస దీక్షను విరమిస్తారు.
బన్నీ ప్రచార యావే ప్రాణం తీసింది.. మానవ హక్కుల కమిషన్ కు బన్నీపై ఫిర్యాదు!