బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు ఎందుకు జరుపుకుంటారో తెలుసా..?
TeluguStop.com
ఈ ఏడాది జూన్ నెల ఆఖరిన ముస్లిం సోదరులు( Muslim Brothers ) బక్రీద్ పండుగను జరుపుకుంటారు.
అయితే ఇస్లాం మతాన్ని విశ్వసించే ప్రజల పండుగలలో బక్రీద్( Bakrid ) పండుగ ముఖ్యమైనది.
అయితే ఈ పండుగను త్యాగానికి ప్రతీకగా జరుపుకుంటారు.ఇస్లాం సంప్రదాయం ప్రకారం జిల్హిజ్ మాసంలో చంద్ర దర్శనం అయిన తర్వాత బక్రీద్ పండుగను జరుపుకుంటారు.
అయితే ఈ జూన్ సంవత్సరం మన దేశంలో ఈద్-ఉల్-అదా అంటే బక్రీద్ జూన్ నెల 28వ తేదీన జరుపుకుంటారు.
అయితే ఈ పండుగ ప్రాముఖ్యం, విశిష్టత గురించి ఇప్పుడు తెలుసుకుందాం. """/" /
ఇస్లాం మత పెద్దల ప్రకారం ప్రవక్త హజరత్ ఇబ్రహీం మహమ్మద్ ( Hazrat Ibrahim Muhammad )తనను తాను దేవుని ఆరాధనకు అంకితం చేస్తారు.
ఆయన ఆరాధన పట్ల అల్లా ఎంతగానో సంతోషిస్తారు.అయితే ఒకరోజు అల్లా ప్రవక్త హజ్రత్ ఇబ్రహీం ను పరీక్షించాలని నిర్ణయించుకుంటారు.
ఆ విధంగా హజ్రత్ ఇబ్రహీం వద్దకు వచ్చి నీకు అత్యంత ప్రియమైన లేదా అత్యంత విలువైన వస్తువును త్యాగం చేయమని అడుగుతారు.
అయితే ఆ సమయంలో హజ్రత్ ఇబ్రహీం తన సొంత కొడుకుని బలి ఇచ్చేందుకు సిద్ధమవుతారు.
అప్పుడు అల్లా ఇతను నీ కుమారుడు కదా అని ప్రశ్నిస్తారు.ఆ సమయంలో ప్రవక్త హజ్రత్ ఇబ్రహీం మహమ్మద్ తన కుమారుని కంటే తనకు ప్రియమైనది కానీ, విలువైనది కానీ ఇంకేది లేదని సమాధానం ఇస్తారు.
"""/" / దీంతో తన కుమారుడిని త్యాగం చేయడానికి ముందుకు వస్తారు.
అయితే తన కొడుకును బలి ఇవ్వాలనుకున్న వెంటనే అల్లా ఇబ్రహీం కొడుకు స్థానంలో ఒక గొర్రెను ప్రతిష్టిస్తారు.
ఆ విధంగా తన కుమారుడిని మళ్లీ అతనికి తిరిగి అప్పగిస్తారు.అయితే బలి ఇచ్చే స్థానంలో గొర్రెను చూసి ఆశ్చర్యపోయిన హజ్రత్ ఇబ్రహీం తన కొడుకు గురించి అల్లాను ఆరా తీస్తారు.
ఆ సమయంలో అల్లా నాపై ఉన్న నీ కళంకమైన భక్తిని చూసి నేను ఓడిపోయాను, నీ భక్తికి నేను సంతోషించాను, అని తన కుమారుడిని అతనికి తిరిగి ఇస్తారు.
ఇక అప్పటినుంచి బక్రీద్ పండుగను జరుపుకోవడం మొదలైంది.అందుకే బక్రీద్ పండుగలో గొర్రెలను బలి ఇచ్చే సంప్రదాయం పుట్టింది.
వెండి పాత్రలను చిటికెలో మెరిపించే సూపర్ ఎఫెక్టివ్ చిట్కాలు మీకోసం!