అసలు ఆ మాస్క్ చైనాలో ఎక్కువమందికి ఎందుకు వాడుతున్నారో తెలుసా..?!

ఇండియాలో వర్షాకాలం మొదలవ్వడంతో భారీగా వర్షాలు కురుస్తున్నాయి.ఇటీవల ఉత్తరాదిని వర్షాలు వణికించాయి.

భారీ వర్షాలకు వరద ప్రవాహం రావడంతో ఉత్తరాది రాష్ట్రాలు అతలాకుతలం అయ్యాయి.ఢిల్లీ, ముంబై( Delhi ) వంటి రాష్ట్రాల్లో వరదలకు చాలా బిల్డింగ్ లు మునిగిపోయాయి.

ఇప్పుడు దక్షిణాదిలో కూడా వర్షాలు పడుతున్నాయి.అయితే ఇండియాలో మాన్‌సూన్ సీజన్ నడుస్తుండగా పలు దేశాల్లో ఎండలు దంచికొడుతున్నాయి.

అమెరికా, చైనా లాంటి దేశాల్లో అధిక ఉష్ణోగ్రతలకు ప్రజలు వణికిపోతున్నారు. ""<img Src=" ""img Src=" " / "/> అయితే ఉష్ణోగ్రతల నుంచి కాపాడుకునేందుకు చైనా ప్రజలు ఫేస్‌కినిస్ మాస్క్( Facekinis Mask ) లను ఉపయోగిస్తున్నారు.

వీటిని పాలిస్టర్( Polyester) వంటి తేలికపైన సింథటిక్ బట్టతో తయారుచేస్తారు.రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలను తట్టుకోవడానికి ఈ ఫేస్‌కినిస్ మాస్క్ లను ప్రజలు ధరిస్తున్నారు.

దీంతో వీటికి మార్కెట్‌లో బాగా డిమాండ్ పెరిగిపోయింది.కళ్లు, ముక్కు రంధ్రాలు, నోరు మినహా మిగతా ముఖాన్ని ఇది కవర్ చేస్తుంది.

అలాగే ప్రత్యేక స్లీవ్ లు, యూవీ రెసిస్టెంట్ ఫ్యాబ్రిక్ తో తయారుచేసిన వెడల్పు అంచుగల టోపీలు, తేలికపాటి జాకెట్ లను ఎండ వేడి నుంచి రక్షణ పొందటానికి ఉపయోగిస్తున్నారు.

దీంతో ఈ మాస్క్ లు ఇప్పుడు చైనాలో ఫ్యాషన్ గా మారిపోయాయి.ఎండ వేడి నుంచి చర్మాన్ని కాపాడుకోవడానికి వీటిని ధరిస్తున్నారు.

"""/" / అలాగే బీచ్ లో జెల్లీ పిషన్, కీటకాలు, ఇతర ప్రాణుల నుంచి కాపాడుకునేందుకు కూడా ఈ ఫేస్ మాస్క్ లు ఉపయోగపడతాయి.

అయితే చైనాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.ఉష్ణోగ్రతలకు ప్రజలు అల్లాడిపోతున్నారు.

దాదాపు 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి.దీంతో ప్రజలు బయటకు రావడం తగ్గించేస్తున్నారు.

అత్యవసరమై బయటకు వస్తే ఇలాంటి మాస్క్ లు ధరిస్తున్నారు.అటు అమెరికాలో కూడా ఎండలు పెరిగిపోయాయి.

దీంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.