వివాహమైన మహిళలు మంగళసూత్రాన్ని ఎందుకు ధరిస్తారో తెలుసా..?

మహిళలు ( Women )ఎన్ని అలంకరణ ఆభరణాలు ధరించి ఉన్న మంగళసూత్రం అనేది ఎంతో ముఖ్యమైనది అని చాలా మందికి తెలుసు.

అలాగే మంగళ్ అంటే పవిత్రమైనది అని అర్థం వస్తుంది.సూత్రం అంటే దారం.

అందుకే మంగళ సూత్రం ( Mangal Sutra )అనేది హిందూ సంప్రదాయం ప్రకారం ప్రతి వివాహిత ధరించాల్సిన పవిత్రమైన దారం అని చెబుతూ ఉన్నారు.

భారతీయ హిందూ సంప్రదాయం ప్రకారం మెడలో మంగళసూత్రం కడితేనే పెళ్లి జరిగినట్లు అని దాదాపు చాలామందికి తెలుసు.

అయితే పెళ్లిలో మంగళసూత్రం ఎందుకు కట్టిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.పెళ్లి తర్వాత మహిళలు ఆ మంగళసూత్రాన్ని ఎందుకు ధరించాలో చాలామందికి తెలియదు.

అలాగే వివాహితులు ధరించాల్సిన వస్తువులలో మంగళసూత్రం ముఖ్యమైనది. """/" / దానితో పాటు మెట్టెలు, కుంకుమ, గాజులు, ముక్కుపుడక వీటన్నిటిని వివాహిత మహిళా ధరించాల్సి ఉంటుంది.

నూతనంగా వివాహమైన మహిళకి ఇతర ఆభరణాలలో మంగళసూత్రం ఎంతో ముఖ్యమైనది.ఈ పవిత్రమైన దారాన్ని ధరించినప్పుడు మహిళా తన బాధ్యతలు( Responsibilities ) విధులు గురించి తెలుసుకుంటుంది.

అదే విధంగా ఆమె భర్త తన భార్య పట్ల బాధ్యతగా ఉంటాడు.మంగళ సూత్రం ఒకరి కొరకరి విధేయత ప్రతిజ్ఞ గా పనిచేస్తుంది.

మంగళసూత్రం భార్యాభర్తల మధ్య ప్రేమకు గుర్తు అని పండితులు చెబుతున్నారు.మహిళా మంగళసూత్రాన్ని ధరించినప్పుడు ఆమె తన వైవాహిక జీవితాన్ని అన్ని కష్టాల నుంచి కాపాడుతుందని చెబుతున్నారు.

"""/" / మంగళ సూత్రంలో నల్లపూసలు శివుడి, పార్వతి మధ్య బంధానికి చిహ్నంగా భావిస్తారు.

మంగళసూత్రంలోని బంగారు పార్వతి దేవిని సూచిస్తుంది.నల్ల పూసలు శివుడిని సూచిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి.

ఇంకా చెప్పాలంటే మంగళసూత్రంలో తొమ్మిది పూసలు ఉంటాయి.ఇవి తొమ్మిది విభిన్న శక్తులను సూచిస్తాయి.

ఈ శక్తులు భార్యాభర్తలను దుష్టశక్తుల నుంచి రక్షిస్తాయి.ఈ పూసలు గాలి, నీరు, భూమి, అగ్ని అన్ని మూలకాల శక్తిని కలిగి ఉంటాయి.

ఇవి మహిళా పురుషుల మధ్య సంబంధాన్ని బల పరిచేందుకు ఉపయోగపడతాయి.మంగళసూత్రానికి దైవిక శక్తులు ఉన్నాయని చాలామంది ప్రజలు నమ్ముతారు.

పీరియడ్స్ ఆన్ టైమ్ కి రావాలంటే ఇలా చేయండి..!