పెళ్లి అయిన మహిళలు నల్లపూసలు ఎందుకు ధరిస్తారో తెలుసా?

మన హిందూ సాంప్రదాయాల ప్రకారం పెళ్లి అయిన తర్వాత మహిళ కొన్ని ఆభరణాలను కచ్చితంగా ధరించాల్సి ఉంటుంది.

అందులో ముఖ్యంగా మంగళసూత్రం, కాలి మెట్టెలు, H3 Class=subheader-styleనల్లపూసలు/h3p ఇవన్నీ పెళ్లయిన తర్వాత ధరిస్తారు.

ఈ విధంగా ఆభరణాలను ధరించడం మన సాంప్రదాయంలో ఒక భాగం అని చెప్పవచ్చు.

అయితే ఈ ఆభరణాలను ధరించడానికి ఒక్కోదానికి ఒక్కొక్క ఒక కారణం ఉంది.అయితే ప్రస్తుతం పెళ్లైన మహిళలు మాత్రమే నల్లపూసలు ఎందుకు ధరిస్తారో ఇక్కడ తెలుసుకుందాం పూర్వ కాలంలో పెళ్లి తర్వాత మహిళ మంగళసూత్రాన్ని నల్లపూసలలో వేసుకునే ధరించేది.

పూర్వం ఈ నల్లపూసల నల్ల మట్టితో చేసేవారు.ఈనల్ల మట్టితో తయారు చేసిన పూసలను వేసుకోవడం ద్వారా ఆ పూసలు మన చాతి పై పడటం ద్వారా మన శరీరంలో ఉన్న వేడిని తొలగిస్తుంది.

ఈ విధంగా నల్లపూసలు మన శరీరంలో వేడిని తగ్గించడం ద్వారా అనేక గుండె సంబంధిత సమస్యల నుంచి మనల్ని రక్షిస్తుంది.

మట్టితో తయారు చేసిన నల్లపూసల దండను వధూవరులచే నీలలోహిత గౌరీకి పూజ చేస్తారు.

ఈ విధంగా పూజలు చేయటం ద్వారా ఆ గౌరీ మాత అనుగ్రహం కలిగి వారు జీవితాంతం కలిసిమెలిసి సుఖంగా ఉంటారని శాస్త్రం చెబుతోంది.

అంతేకాకుండా వధువు నిత్యం దీర్ఘ సుమంగళీగా ఉండాలని భావించి ఈ గౌరీ వ్రతం చేస్తారు.

నీలలోహిత గౌరీ సన్నిధి నందు నల్లపూసల దండను ధరించటం వల్ల వధూవరులకు సంబంధించిన ఎటువంటి జాతక దోషాలైనా, సర్ప దోషాలైనా తొలగిపోతాయని పండితులు తెలియజేస్తున్నారు.

అందువల్ల పూర్వకాలంలో పెళ్లైన మహిళలు మంగళసూత్రాన్ని నల్లపూసలలో మాత్రమే వేసుకుని ధరించే వారు.

కానీ ప్రస్తుత కాలంలో మట్టితో తయారు చేసిన నల్లపూసలు కనుమరుగైపోయాయి.ప్రస్తుతం బంగారు షాపులలో రెడీమేడ్ పూసలు దొరుకుతున్నాయి.

అంతే కాకుండా ఇప్పుడు మహిళలు మంగళ సూత్రాన్ని నల్లపూసలలో కాకుండా, బంగారు దండలో వేసుకోవడం మనం చూస్తున్నాం.

అలసిపోయాను.. ప్రేమించే వ్యక్తి కావాలి.. ఇలియానా కామెంట్స్ వైరల్!