పూజా సమయంలో పువ్వులను ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా?
TeluguStop.com
సాధారణంగా మనం పూజ చేసేటప్పుడు దేవునికి పుష్పాలతో అలంకరించి పూజిస్తారు.ఫలానా పువ్వులు అని లేకుండా మనకు అందుబాటులో ఉన్న పువ్వులతో స్వామివారికి అలంకరించి పూజ చేయడం ఆనవాయితీగా వస్తోంది.
అయితే పూజ చేసే సమయంలో పువ్వులను ఎందుకు అలంకరిస్తారో బహుశా చాలా మందికి తెలియక పోవచ్చు.
పూజలో పువ్వులను ఎందుకు వాడుతారు? వాటి ఉపయోగం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.సాధారణంగా మనం పూజ చేసేటప్పుడు స్వచ్ఛమైన మనసుతో, భక్తి శ్రద్ధలతో స్వామివారిని తలచుకొని ఎవరైతే పుష్పాలను,ఫలాలను స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారో అలాంటివారి భక్తితో పెట్టిన నైవేద్యాన్ని తృప్తిగా ఆరగిస్తారని సాక్షాత్తూ ఆ శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో తెలియజేశారు.
ఎవరైతే భక్తితో స్వచ్ఛమైన మనసుతో స్వామి వారిని వేడుకుంటారో వారి వెన్నంటే ఉండి కాపాడుతారని నమ్ముతారు.
అందువల్ల మనం పూజలో పుష్పాలను ఉపయోగిస్తారు.అయితే స్వామివారికి అలంకరించిన ఈ పుష్పాలను పురుడు పోసుకున్న వారు, నెలసరి అయిన వారు తాకకూడదు.
అలాంటివారు తాకినప్పుడు ఆ పువ్వులు పూజకు పనికిరావు.అలాగే నేలను తాకిన పువ్వులను దేవునికి సమర్పించ రాదు.
దేవుడికి సమర్పించే పువ్వులను ఎప్పుడూ కూడా వాసన చూడకూడదు.అలా వాసన చూసిన, వాడిపోయిన, పువ్వులను కడిగి ఉపయోగించరాదు.
పూజ సమయంలో మందార పువ్వులు, ఎర్ర గన్నేరు, చామంతి, నందివర్ధనం, తామర పూలు, పారిజాతం, నీలాంబరాలు, నిత్యమల్లె మొదలైనవి పూజకు ఎంతో ప్రసిద్ధిచెందిన పుష్పాలు.
మగవారు పూజ చేసేటప్పుడు కంఠానికి గంధం ధరించి, చెవిలో పూలు పెట్టుకొని పూజ చేయాలి.
ఆడవారు ఎప్పుడు కూడా జుట్టులో తులసి దళాలను పెట్టుకోకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి.సాధారణం వినాయకుని, సూర్యభగవానుని తెల్ల జిల్లేడు తో పూజిస్తారు విష్ణు భగవానునికి తులసీదళాలతో, సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి తామర పువ్వు పై దర్శనం కల్పిస్తారు.
ఆ పరమ శివుడు కి మారేడు దళాలతో, తెల్లని పుష్పాలతో పూజించడం వల్ల స్వామివారి అనుగ్రహం మనకు కలుగుతుంది.
మిస్ ఇండియా యూఎస్ఏగా చెన్నై భామ.. ఎవరీ కైట్లిన్ సాండ్రా?