శ్రీకాంత్ స్టార్ హీరో అవ్వకుండా ఆయన్ని తొక్కేసింది ఎవరో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు శ్రీకాంత్( Srikanth ).

ఇక చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలు తమదైన రీతిలో సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళుతున్న క్రమంలో శ్రీకాంత్, జగపతిబాబు లాంటి నటులు ఫ్యామిలీ హీరోలుగా గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా చిన్న దర్శకులతో పెద్ద సక్సెస్ లను అందుకున్నారు.

ఇక వీళ్ళ ఎంటైర్ కెరియర్ ను కనక మనం ఒకసారి చూసుకున్నట్లైతే ముందుగా శ్రీకాంత్ అయితే సినిమా ఇండస్ట్రీలో తనదైన రీతిలో మంచి సినిమాలు చేసే ప్రయత్నం అయితే చేశాడు.

ఇక అందులో భాగంగానే పెళ్లి సందడి, వినోదం, ఆహ్వానం ( Pelli Sandadi , Aahvaanam )లాంటి ఎన్నో సూపర్ హిట్ సక్సెస్ లను అందుకున్నాడు.

అయితే శ్రీకాంత్ స్టార్ హీరోగా ఎందుకు మారలేకపోయాడు. """/" / మీడియం రేంజ్ హీరో గానే ఎందుకు మిగిలిపోయాడు అనే ప్రశ్న అందరిలో తలెత్తుతుంది.

ఆయనని ఎవరైనా తొక్కేసారా అనే అనుమానాలు కూడా అప్పుడప్పుడు వ్యక్తం అవుతూ ఉంటాయి.

నిజానికి శ్రీకాంత్ ను ఎవరు తొక్కేయలేదు.శ్రీకాంత్ కి ఒక సినిమా సక్సెస్ అయిన వెంటనే అంతకుముందే కమిట్ అయిన మూడు, నాలుగు సినిమాలు ఉండేవి.

ఇక ఆ సినిమాలు వరుసగా వచ్చి ఫ్లాప్ అయ్యేవి దాని వల్ల ఆయనకి బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లను సాధించలేకపోయాడు.

"""/" / అయితే ఒక సక్సెస్ వచ్చిన తర్వాత ఆయన కొంచెం కొత్తగా ట్రై చేద్దాం అనుకునే లోపే అంతకుముందే కమిట్ అయిన కొన్ని సినిమాలు ఉండటం వల్ల అవి అంత పెద్ద సక్సెస్ అవ్వకపోవడం ఆయనకు భారీ మైనస్ గా అయింది.

ఒక విధంగా చెప్పాలంటే ఆయనను ఎవరు తొక్కేయలేదు ఆయనకి ఆయనే తొక్కేసుకున్నాడనే చెప్పాలి.

చూడాలి మరి ఇప్పటికైనా వైవిధ్యమైన పాత్రలను చేస్తూ మంచి గుర్తింపును సంపాదించుకుంటాడా లేదా అనేది.

శ్రీ విష్ణు చేసిన స్వాగ్ సినిమా హిట్టా.? ఫట్టా.?