కాంబోడియా ప్రాచీన బంగారు ఆభరణాలను బ్రిటన్‌కు ఎత్తుకెళ్లింది ఎవరో తెలుసా?

కాంబోడియా ప్రాచీన ఆభరణాలు కొంతకాలం క్రితం దొంగతనానికి గురయ్యాయి.అయితే తాజాగా అవి బ్రిటన్‌లో ప్రత్యక్షమయ్యాయి.

క్రీస్తు శకం 700 సంవత్సర కాలానికి చెందిన ఈ ఆభరణాలను బ్రిటన్‌ వాసి, స్మగ్లర్ డగ్లస్ లాచ్‌ఫోర్డ్‌ కాంబోడియా నుంచి ఇక్కడికి ఎత్తుకొచ్చాడు.

అతి ప్రాచీనమైన ఈ ఆభరణాలలో చాలా వరకు విచిత్రంగానే ఉన్నాయని అధికారులు తెలుపుతున్నారు.

ఇక ఎవరికీ తెలియకుండా వీటిని కాంబోడియాకు బ్రిటిష్ అధికారులు అందజేశారు.దీంతో సంతోషించిన కాంబోడియా త్వరలోనే వీటిని తన దేశంలోని నేషనల్ మ్యూజియంలో ఎగ్జిబిషన్‌కు ఉంచనుంది.

డగ్లస్ లాచ్‌ఫోర్డ్ ఒక్క కాంబోడియా నుంచి మాత్రమే కాదు చాలా దేశాల నుంచి విలువైన వస్తువులను బ్రిటన్ కు తరలించాడు.

ఈ గజదొంగ 2020లో తుది శ్వాస విడిచాడు.తర్వాత డగ్లస్ దగ్గర ఉన్న కాంబోడియా ఆస్తులన్నీ తిరిగి ఇచ్చేస్తామని అతని కుటుంబం వెల్లడించింది.

కాంబోడియాకి చెందిన ఒక అధికారి డగ్లస్ కుటుంబంతో కూడా కాంటాక్ట్ అయ్యాడు.వారి కుటుంబం అతడికి నాలుగు పెట్టలు చూపించింది.

ఆ పెట్టెలోనే కాంబోడియా రాజులకు చెందిన ఆభరణాలు ఉన్నాయి. """/"/ ఈ ఆభరణాలు చూడగానే కాంబోడియా నాగరికత కళ్ళకు కట్టినట్లు కనిపించిందని ఆ అధికారి తెలిపాడు.

ఆ నాలుగు పెట్టెలలోనే మొత్తం 77 బంగారు నగలు ఉన్నాయని అధికారి వెల్లడించాడు.

వాటిలో బంగారు కిరీటాలు, వడ్డాణాలు, చెవి పోగులు ఇంకా ఎన్నో విలువైన వస్తువులు ఉన్నాయని చెప్పుకొచ్చాడు.

11వ శతాబ్దానికి చెందిన ఒక పెద్ద గిన్నె కూడా ఉందని అది బంగారం తోనే తయారు చేసినట్లు అతడు వెల్లడించాడు.

అప్పటి రాజులు ఈ గిన్నెను 'రైస్ బౌల్'గా ఉపయోగించి ఉండొచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.

"""/"/ అంకోర్ రాజులు వాడిన ఆభరణాలుగా ఇవి కనిపిస్తున్నట్లు ఇంకొందరు చరిత్రకారులు చెబుతున్నారు.

ఈ రాజవంశీయులకంటే ముందు వేరే రాజులు వాడిన బంగారు ఆభరణాలు కూడా ఈ పెట్టెలలో కనిపించినట్లు నిపుణులు తెలిపారు.

ఇవి ఎప్పుడు దొంగతనానికి గురయ్యాయి ఎలా వీటిని బ్రిటన్ కి తీసుకొచ్చారు అనేది ఇంకా తెలియ రాలేదు.

అంకోర్ కాలానికి చెందిన ఆభరణాలు ఇతర దేశాల్లోనూ ఉండి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు.

ఇదిలా ఉండగా అంకోర్ రాజవంశాలకు చెందిన ప్రాచీన బంగారు నగలను అప్పజెప్పినందుకు కాంబోడియా నేత హన్ సేన్ హర్షం వ్యక్తం చేశారు.

ఇండస్ట్రీ కి వచ్చి 20 సంవత్సరాలు అయినప్పటికి నితిన్ స్టార్ హీరో ఎందుకు కాలేకపోయాడు…