ప్రభాస్ సినిమా కోసం సెట్ అవుతున్న ఈ ఇద్దరు హీరోయిన్స్ ఎవరో తెలుసా ?

ఇటీవల కాలంలో సలార్, కల్కి ( Salar, Kalki )సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నాడు ప్రభాస్.

ఇప్పుడు సలార్, కల్కి సీక్వెల్స్ పూర్తి చేసే పనిలో పడ్డాడు.ఇది కాకుండా సందీప్ రెడ్డి వంగాతో కలిసి "స్పిరిట్" సినిమా( "Spirit" Movie ) చేస్తున్నాడు.

డైరెక్టర్ మారుతీతో "రాజా సాబ్" అనే ఒక చిన్న హారర్ కామెడీ చిత్రంలో కూడా ప్రభాస్ యాక్ట్ చేస్తున్నాడు.

మొత్తం మీద ఈ హీరో చేతిలో చాలానే సినిమాలు ఉన్నాయి.రీసెంట్ గానే కన్నప్పలో తన పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసినట్లు ఉన్నాడు.

ఈ నేపథ్యంలోనే ఒక ఆసక్తికరమైన న్యూస్ బయటకు వచ్చింది.అదేంటంటే ఈ యాక్టర్ రాఘవపూడి హను( Raghavapudi Hanu ) డైరెక్షన్‌లో ఓ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడట.

దీనికి "ఫౌజీ" అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు సమాచారం.ఇదొక పీరియాడిక్ డ్రామా.

యాక్షన్ సన్నివేశాలు కూడా మస్తుగా ఉంటాయట.మైత్రీ మూవీ మేకర్స్‌ దీనిని నిర్మించనున్నట్లు తెలుస్తోంది.

కానీ ప్రస్తుతం ప్రభాస్ చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి కాబట్టి ఈ సినిమాకి డేట్స్ ఇవ్వగలడా అనేది ప్రశ్నార్థకమే.

ఇది పీరియాడిక్ డ్రామా అని తెలిసిన వెంటనే ప్రభాస్ ఓకే చెప్పాడని ఇండస్ట్రీలో టాక్‌ నడుస్తోంది.

అయితే ఇప్పటిదాకా ఈ మూవీని అధికారికంగా అనౌన్స్ చేయలేదు.ఇవి వట్టి మాటలో లేదంటే నిజమో ఇంతవరకైతే తెలియ రాలేదు.

కానీ కొంతమంది మాత్రం ఈ సినిమాలో ప్రభాస్ కి జంటగా ఒక హీరోయిన్ ఎన్నికైనట్లు ప్రచారం మొదలుపెట్టారు.

వారి ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్‌గా చేయబోయేది సజల్ అలీ.( Sajal Ali ) ఈమె పాకిస్థాన్‌లో హైయ్యెస్ట్ పెయిడ్ యాక్ట్రెస్.

ఈ ముద్దుగుమ్మ మొదట మోడల్ గా పనిచేసింది.ఆ తర్వాత సినిమాలు, టీవీ సీరియల్స్‌లో నటిస్తూ ఆకట్టుకుంటుంది.

లాహోర్‌లో పుట్టిన ఈ ముద్దుగుమ్మ వయసు 30 ఏళ్లు. """/" / శ్రీదేవి టైటిల్ రోల్ చేసిన "మామ్‌" సినిమాలో ఈ అందాల తార ఒక మంచి పాత్ర పోషించింది.

ఇప్పటిదాక ఈ నటి తన కెరీర్‌లో జస్ట్ నాలుగైదు సినిమాలే చేసింది.దర్శకుడు హను రాఘవపూడి ఆమెను ఎప్పుడు చూశాడో, ఎలా కనెక్ట్ అయ్యాడో తెలియదు కానీ ప్రభాస్ పక్కన ఆమెనే ఈ దర్శకుడు ఎంపిక చేసుకున్నాడని బలంగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఈమె సోషల్ మీడియాలో బాగానే పాపులారిటీ సంపాదించుకుంది.పాక్ నటి అయినా బాలీవుడ్‌లో పెద్దగా పాపులర్ కాలేదు.

"""/" / ఈ సినిమాలో హీరోయిన్ గా చేయడానికి సజల్ అలీ ఒప్పుకోకపోతే ఇమాన్ ఇస్తాయిల్ ( Iman Istayil )అనే మరో నటిని తీసుకోవాలని సదరు దర్శకుడు భావిస్తున్నాడట.

ఈ ఢిల్లీ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా పాపులర్ అయింది.ఎంబీఏ పూర్తి చేశాక అమెరికాలో డ్యాన్స్ నేర్చుకుంది.

మ్యూజిక్ వీడియోల్లో ఎక్కువగా చేస్తుంది.ఇప్పటికే యూట్యూబ్‌లో మస్ట్ పాపులర్ అయింది.

ఓ చానెల్ కూడా రన్ చేస్తోంది.అయితే వీరి బ్యాక్ గ్రౌండ్స్ చూస్తే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన సరిపోతారా అనే అనుమానం కలగక మానదు.

సాధారణంగా ఒక సినిమాలో హీరోయిన్ ఇమేజీ, ఇండస్ట్రీలో పాపులారిటీ, ఫేమ్ చాలా ముఖ్య పాత్ర పోషిస్తాయి.

పైగా ఈ రోజుల్లో స్టార్ కాస్టింగ్ ఆధారంగానే సినిమాల సక్సెస్ ఆధారపడి ఉంటుంది.

ఇవన్నీ హను రాఘవపూడి ఆలోచించాలి.ఈ దర్శకుడు సినిమాల్లో నటించి చాలామంది పర్సనల్ లైఫ్ లో సెటిల్ అయ్యారు ఉదాహరణకి అందాల రాక్షసి హీరోయిన్ లావణ్య మెగా కోడలు అయింది.

కృష్ణగాడి వీరప్రేమగాథ హీరోయిన్ మెహరీన్‌ కూడా మెగా కోడలు కాబోయే ఛాన్స్ ఉందని అంటున్నారు.

ఈయన లై మూవీ ద్వారా పరిచయమైన మేఘా ఆకాశ్, సీతారామం మూవీ ద్వారా తెలుగు వారికి సుపరిచితురాలైన మృణాల్ ఠాకూర్ కూడా కెరీర్ లో బాగా లాభపడ్డారు.

వైరల్ వీడియో: ఇకపై నోట్స్ రాయడాలకు చెక్ పడినట్లేనా..?