ఈ తెలుగు సాంగ్స్ ఎవరు పాడారో తెలిస్తే ఆశ్చర్యపోతారు..
TeluguStop.com
తెలుగులో కొన్ని సాంగ్స్ ప్రొఫెషనల్ సింగర్స్ కాకుండా నటిమణులు, యాంకర్లు, నిర్మాతలు పాడారు.
కానీ వాటిని ప్రొఫెషనల్ సింగర్లు పాడారేమో అని చాలామంది అనుకుంటారు.ఎందుకంటే అంత బాగా వాటిని వాళ్లు పాడగలిగారు.
తమ సింగింగ్ టాలెంట్ చాటుకున్నారు.ఆ పాటలు ఏవో వాటిని పాడింది ఎవరో తెలుసుకుందాం.
H3 Class=subheader-styleసుయ సుయ సాంగ్/h3p """/" /
యాక్షన్ కామెడీ మూవీ విన్నర్ (2017)లో "సుయ సుయ సుయ అనసూయ" అనే ఒక పాట ఉంటుంది.
ఇదొక ఐటమ్ సాంగ్ లాగా ఉంటుంది ఇందులో యాంకర్ అనసూయ హాట్ స్టెప్పులు వేస్తూ హీరోకి కైపెక్కిస్తుంటుంది.
ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు.ఈ పాటలో అనసూయ కోసం పాడిన సింగర్ గొంతు కాస్త వెరైటీగా అనిపిస్తుంది.
ఎందుకంటే ఆ పాట పాడింది ప్రొఫెషనల్ సింగర్ కాదు.దాన్ని పాడింది యాంకర్ సుమ కనకాల( Suma Kanakala )సాధారణంగా సుమ గలగలా మాట్లాడుతుంది.
పంచ్‌లతో ఎలాంటి షోనైనా రక్తి కట్టించగలదు.కానీ ఆమెలో సింగింగ్ టాలెంట్ కూడా ఉందని చాలామందికి తెలియదు.
అయితే ఈ మూవీ సంగీత దర్శకుడు తమన్ ఆమెలోని ప్రతిభను గుర్తించి ఈ పాటను పాడించాడు.
ఇదే పాటలోని మేల్ పార్ట్‌ను అనురాగ్ కులకర్ణి పాడాడు.h3 Class=subheader-styleఅన్నయొచ్చినాడో బిట్ సాంగ్/h3p:
పొలిటికల్ యాక్షన్ డ్రామా ఫిలిం జోష్ (2009)లో అన్నయొచ్చినాడో అనే ఒక బిట్ సాంగ్ ఉంటుంది.
జేడీ చక్రవర్తిని ఉద్దేశించి కాలేజి స్టూడెంట్స్ ఈ పాట పాడతారు.ఇది 52 సెకన్లు మాత్రమే ఉంటుంది.
దీనిని ప్రముఖ టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు పాడాడు.ఇది ఆశ్చర్యకరంగా అనిపించడం నిజం.
కానీ దిల్ రాజుకు పాటలు పాడటం అంటే చాలా ఇష్టం.అందుకే ఈ చిన్న సాంగ్ పాడి తన కోరిక తీర్చుకున్నాడు.
దీనికి అతనే ప్రొడ్యూసర్.ఈ పాటకు చంద్రబోస్ లిరిక్స్ అందించారు.
సందీప్ చౌతా మ్యూజిక్ కంపోజ్ చేశాడు.h3 Class=subheader-styleఏందిరో/h3p """/" /
వంశీ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన దొంగాట (2015) సినిమాలో "ఏందిరో" అనే పాటను మంచు లక్ష్మి( Manchu Lakshmi ) అద్భుతంగా పాడి అందరి నుంచి ప్రశంసలు అందుకుంది.
ఆమె సాధారణంగా ఇంగ్లీష్ స్లాంగ్ కలిగి ఉంటుంది.అయినా తెలుగు పాటను అర్థమయ్యేలాగా బాగా పాడి వావ్ అనిపించింది.
ఈ సినిమాలో ఆమె నటించింది కూడా అంతే కాదు ప్రొడ్యూసర్ కూడా ఆమే!
H3 Class=subheader-styleబంగారు/h3p
హీరోయిన్ రాశి ఖన్నా మంచి నటి మాత్రమే కాదు మంచి సింగర్ కూడా.
ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే చాలా పాటలు పాడి ఆకట్టుకుంది.సాయి ధరంతేజ్ హీరోగా వచ్చిన జవాన్ సినిమాలో ఆమె "బంగారూ.
" అనే పాటను అద్భుతంగా పాడింది.ఆ సాంగ్ ప్రొఫెషనల్ సింగర్ పాడినట్లే ఉండటంవల్ల రాశి కన్నా( Raashii Khanna ) పాడిందని చాలామంది ఊహించలేరు.