Animal Movie :యానిమల్ మూవీలో రణబీర్ తో బోల్డ్ గా నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా..?
TeluguStop.com
ఏదైనా కొత్త సినిమా విడుదలవుతుంది అంటే కచ్చితంగా అందులో ఇప్పటివరకు ఎందులో కూడా కనిపించని వారి గురించి సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతూ ఉంటుంది.
ఇక సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక వారు ఎవరు అని తెలుసుకోవడం చాలా సులువు అయిపోయింది.
ఇక రీసెంట్గా విడుదలైన ఈ యానిమల్ మూవీ ( Animal Movie ) ఫస్ట్ షో తోనే పాజిటివ్ టాక్ తెచ్చుకుని బ్లాక్ బస్టర్ హిట్ అయింది.
ఇక ఈ సినిమాలో రష్మిక రణబీర్ కపూర్ మెయిన్ హీరో హీరోయిన్స్ కాగా బాబి డియోల్,అనిల్ కపూర్ వంటి వాళ్ళు కీలకపాత్రల్లో నటించారు.
అయితే ఈ సినిమాలో రష్మిక మందన్నా కంటే ఎక్కువ ఫేమస్ అయ్యింది త్రిప్తి డిమ్రీ అనే నటి.
"""/" /
ఈమె రణబీర్ కపూర్ ( Ranbir Kapoor ) తో కలిసి బోల్డ్ సన్నివేశాల్లో రెచ్చిపోయి నటించింది.
దాంతో ఈ సినిమా చూడని వాళ్ళు కూడా అసలు త్రిప్తి డిమ్రీ ఎవరు అని తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
మరి ఇంతకీ ఈ త్రిప్తి దిమ్రీ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.ఉత్తరాఖండ్లో పుట్టి పెరిగిన త్రిప్తి డిమ్రి ( Tripti Dimri ) మోడలింగ్ పై మక్కువతో ముంబైకి వచ్చి కొన్ని బిజినెస్ యాడ్స్ లో చేసింది.
అలా సంతూర్ సోప్ యాడ్లో సంతూర్ మమ్మీగా మెరిసిపోయింది.ఆ తర్వాత కొన్ని సినిమాల్లో కూడా కథానాయిక గా చేసినప్పటికీ అంతగా గుర్తింపు మాత్రం తెచ్చుకోలేదు.
"""/" /
కానీ సందీప్ రెడ్డి వంగ ( Sandeep Reddy Vanga ) దర్శకత్వంలో వచ్చిన యానిమల్ సినిమాతో త్రిప్తి డిమ్రీకి మంచి గుర్తింపు లభించింది.
బోల్డ్ సన్నివేశాలలో నటించడంతో ఈమె పేరు ఒక్కసారిగా సోషల్ మీడియాలో మార్మోగిపోతుంది.ఇక ఈ సినిమాలో రష్మిక మందన్న ( Rashmika Mandanna ) కంటే ఎక్కువగా త్రిప్తి డిమ్రీకి పేరు రావడంతో కచ్చితంగా ఈమెకు స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు వస్తాయి అని అందరూ భావిస్తున్నారు.
ఇక త్రిప్తి డిమ్రీ కి ఒకప్పుడు కెమెరా ముందు కు రావాలంటేనే చాలా సిగ్గుగా ఉండేదట.
కానీ ఎప్పుడైతే యానిమల్ సినిమాలో గోల్డ్ గా నటించిందో అప్పటినుండి తనపై తనకి నమ్మకం వచ్చిందట.
ఇక త్రిప్తి డిమ్రీ కి ట్రావెలింగ్ చేయడం అంటే చాలా ఇష్టం అని తెలుస్తోంది.
ఈ పొడిని నిత్యం తీసుకుంటే మీ కంటి చూపు పెరగడం గ్యారెంటీ!