చిరంజీవి నెక్స్ట్ సినిమా డైరెక్టర్ ఎవరో తెలుసా..? కమర్షియల్ సినిమాలకే ఓటు వేస్తున్న చిరు…
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న నటుడు చిరంజీవి( Actor Chiranjeevi ).
ఇక తనదైన రీతిలో సినిమాలను చేసుకుంటూ ఇండస్ట్రీలో ముందుకు సాగుతున్న ఆయన సినిమా ఇండస్ట్రీకి పెద్దగా తనదైన బాధ్యతలను కూడా నిర్వర్తిస్తున్నాడు.
ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం చిరంజీవి వశిష్ట డైరెక్షన్ ( Vashista )లో విశ్వంభర అనే సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా తర్వాత ఆయన భారీ సినిమాలను చేయాలనే ఉద్దేశ్యంలో ఉన్నట్టుగా తెలుస్తుంది.
ఇక అందులో భాగంగానే ఇప్పటికే ఆయనతో సినిమాలు చేయడానికి చాలా మంది దర్శకులు క్యూ కడుతున్నారు.
"""/" /
ఇక అందులో కొంతమంది తమిళ్ డైరెక్టర్లు ఉంటే మరి కొంతమంది తెలుగు డైరెక్టర్లు ఉండటం విశేషం.
ఇక ఇప్పటికే గాడ్ ఫాదర్ లాంటి ఒక ఫ్లాప్ సినిమాని అందించిన మోహన్ కృష్ణ డైరెక్షన్ లో మరొక సినిమా చేయడానికి చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.
ఇక అతనితో పాటుగా హరీష్ శంకర్, మారుతి( Harish Shankar, Maruti ) లాంటి దర్శకులతో కూడా సినిమాలు చేయడానికి చిరంజీవి ఆసక్తి చూపిస్తున్నాడు.
ఇక తను అనుకున్నట్టుగానే ఇప్పుడు విశ్వంభర సినిమా( Vishwambhara ) తర్వాత ఆయన ఏదైనా ఒక డిసీజన్ ని తీసుకోవాలని చూస్తున్నట్లుగా తెలుస్తుంది.
"""/" /
అయితే కమర్షియల్ సినిమా డైరెక్టర్లతోనే ఆయన సినిమాలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాడు.
ఒక డిఫరెంట్ అటెంప్ట్ ను చేసే దర్శకులకి ఆయన అవకాశాలను ఎక్కువగా ఇవ్వలేడు.
ఎందుకంటే చిరంజీవికి ఈ ఏజ్ లో సక్సెస్ ఫుల్ సినిమాలు మాత్రమే కావాలి.
అంతే తప్ప ఎక్స్పరిమెంటల్ సినిమాలను చేసి ప్లాపులు మూట గట్టుకోవాల్సిన అవసరం తనకు లేదనే ఉద్దేశంతోనే చిరంజీవి రొటీన్ రెగ్యులర్ ఫార్మాట్ లో సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు.
ఇక తను అనుకున్నట్టుగానే వరుస సినిమాలను చేసి సక్సెస్ లను అందుకోవాలని అతని అభిమానులు కూడా కోరుకుంటున్నారు.
మరి ఇదిలా ఉంటే తన నెక్స్ట్ సినిమా ఎవరితో చేయబోతున్నాడు అనే దానిమీద సరైన క్లారిటీ రావాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
ఓరి మీ దుంపతెగ.. అంత్యక్రియల్లో నవ్వులు, డ్యాన్సులేంట్రా.. (వీడియో)