శ్రావణమాసంలో ఏ శివలింగాన్ని పూజిస్తే మంచి ఫలితం లభిస్తుందో తెలుసా..?

ఈ ఏడాది శ్రావణమాసం( Shravana Masam ) జులై 18వ తేదీన మంగళవారం వచ్చింది.

ఈ సమయంలో శివలింగాన్ని పూజిస్తారు.ఈ కాలంలో పరమశివుడి స్వరూపమైన శివలింగానికి జలాభిషేకం, పంచామృత అభిషేకం చేస్తారు.

శ్రవణ మాసంలో ఏ శివలింగాన్ని పూజించాలి? శ్రావణమాసంలో శివలింగాన్ని ఎలా పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆకాశమే లింగం.భూమి దాని పీఠం.

అది సమస్త దేవతలకు నిలయం.అదే అంతా లయం చెందుతుంది.

అందుకే దీనిని లింగం అని అంటారు.లిం అంటే మన కంటికి కనిపించకుండా లీనమై, ఉన్నదానిని గం’ అంటే ఒక గుర్తు రూపంలో కూడా తెలియజేస్తూ ఉంటుంది.

అందుకే అది లింగమైంది.ఈ సృష్టి మొత్తం శివమయం.

ఈ సమస్తము ఆయనతో నిండి ఉంటుంది.సృష్టికి పూర్వం ఈ సమస్త విశ్వమంతా నీటితో నిండి అంతులేని మహాసముద్రంలో ఉండేది.

ఆ మహాజలం నుంచి ఒక మహా తేజస్సు ఉత్పన్నమైంది.ఈ తేజస్సు క్రమంగా ఒక రూపాన్ని కూడా సంతరించుకుంది.

"""/" / శివలింగం( Shiva Lingam ) రకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

శివలింగంలో ప్రధానంగా రెండు రకాలు ఉన్నాయి.స్వయంభూ శివలింగం, మానవ నిర్మిత శివలింగం.

స్వయంభూ శివలింగం ఉల్క వంటి నల్లని అండాకారంలో ఉంటుంది.ఇది పరమేశ్వరుడే( Lord Shiva ) స్వయంగా వివిధ సందర్భాల్లో లింగ రూపంలో కొలువు దీరినట్లు చెబుతారు.

మన దేశంలో ఈ శివలింగాన్ని జ్యోతిర్లింగం అని కూడా అంటారు. """/" / అయితే పాదరసంతో చేసిన శివలింగం విశేష ఫలితాలను ఇస్తుంది.

ఈ శివలింగం ప్రాచీన వేద శాస్త్రం పై ఆధారపడి రూపొందిస్తారు.ఇంకా పురాణాల ప్రకారం శివలింగంలో ఆరు ప్రధాన రకాలు ఉన్నాయి.

దేవ లింగం,అసుర లింగం, పురాణ లింగం, పార్దివ లింగం, స్వయంభు లింగం.అలాగే శ్రావణమాసంలో ఏ శివలింగాన్ని పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

శ్రావణమాసంలో ఒక వ్యక్తి పార్దివ శివలింగాన్ని, స్వయంభూ శివలింగాన్ని, పురాణ లింగాన్ని పూజించడం ఎంతో మంచిది.

త్రివిక్రమ్ గుంటూరు కారం విషయం లో ఎలాగైతే చేశాడో దేవర విషయం లో కొరటాల అలానే చేశాడా.?