ప్రభాస్ సినిమాల్లో వాళ్ల అమ్మకి బాగా నచ్చిన సినిమా ఏంటో తెలుసా..?

యంగ్ రెబల్ స్టార్ గా ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు ప్రభాస్.

( Prabhas ) అయితే ఈశ్వర్ సినిమా నుంచి ఆయన చేసిన ప్రతి సినిమా కూడా ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్ సాధించడమే కాకుండా కృష్ణంరాజు ఎలాంటి ఇమేజ్ ను అయితే సంపాదించుకున్నాడో అలాంటి ఇమేజ్ ని ప్రభాస్ కూడా సంపాదించుకున్నాడు.

ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన హోదాని కూడా క్రియేట్ చేసుకున్నాడు.

ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. """/" / ఇక ఇదిలా ఉంటే ప్రభాస్ వాళ్ల అమ్మ నాన్న లా గురించి ఎవరికీ పెద్దగా తెలీదు.

అయితే ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు( Uppalapati Suryanarayana Raju ) శివ కుమారి( Shiva Kumari ) దంపతులకు 1979 వ సంవత్సరం అక్టోబర్ 23 వ తేదీన ప్రభాస్ జన్మించాడు.

ఇక వాళ్ల నాన్న అనారోగ్య కారణం గా మరణించారు.కానీ ప్రభాస్ వాళ్ల అమ్మకి( Prabhas Mother ) ఆయన నటించిన సినిమాల్లో ఏ సినిమా అంటే ఇష్టం అని ఆయన అభిమానులు తెలుసుకోవాలనే కుతూహలం తో అయితే ఉన్నారు.

ఇక దీనికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. """/" / ఇక ప్రభాస్ వాళ్ళ అమ్మకి ఆయన చేసిన సినిమాల్లో మిర్చి సినిమా( Mirchi Movie ) అంటే చాలా ఇష్టమట.

ఎందుకంటే ఈ సినిమాలో ఫాదర్ అండ్ సన్స్ మధ్య ఉండే ఎమోషన్ ని చాలా బాగా చూపించారని ప్రభాస్ ని ఎలాంటి క్యారెక్టర్ లో అయితే చూడాలనుకున్నామో అలాంటి క్యారెక్టర్ లోనే ఈ సినిమాలో డైరెక్టర్ కొరటాల శివ చూపించినందుకు చాలా సంతోషం గా ఉందని కూడా ఆమె తన స్నేహితుల దగ్గర చెబుతూ ఉంటుందట.

ఇక దానివల్లే ప్రభాస్ వాళ్ళ అమ్మకి ప్రభాస్ నటించిన సినిమాల్లో మిర్చి ఫేవరెట్ మూవీ అని తెలుస్తుంది.

తెలుగు ఇండస్ట్రీకి దిష్టి తగిలిందా…వరుస వివాదాలలో టాలీవుడ్ సెలబ్రిటీస్!