Home Construction : ఏ మాసంలో గృహ నిర్మాణం చేస్తే మంచిదో తెలుసా..?
TeluguStop.com
గృహ నిర్మాణము( Home Construction ) అనేక వ్యత్యాసాలు,పనులు కష్ట సుఖాలతో కూడినటువంటి వ్యవహారం.
అందుకే పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అని అంటారు.అంటే పెళ్లి చేయడం ఇల్లు కట్టడం అంత సులభం కాదని అర్థం.
గృహ నిర్మాణాలు శాస్త్ర పరమానముతో వాస్తు రీత్యా( Architecturally ) నిర్మించుకోవాలని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త తెలిపారు.
ముహూర్తం ప్రకారం గృహప్రవేశం నిర్మాణం వంటివి ప్రారంభించకుండా ఇష్టప్రకారం చేసిన చేస్తే అనేక సమస్యలు ఎదురవుతాయి.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గృహప్రవేశం, నిర్మాణం వంటివి ప్రారంభించకుండా ఇష్టప్రకారము చేసి అనేక సమస్యలు ఇబ్బందులు తెచ్చుకుంటుంటారని నిపుణులు చెబుతున్నారు.
జ్యోతిష్య శాస్త్రం( Astrology ) ప్రకారం గృహప్రవేశానికి మాస ఫలితములు కూడా చూసుకోవాలి.
"""/" /
వైశాఖమాసం, శ్రావణమాసం, కార్తీక మాసం, మాఘ, ఫాల్గుణ మాసాలు గృహ నిర్మాణానికి ఉత్తమమైన మాసములనీ నిపుణులు తెలిపారు.
అయితే చాంద్రమానము, తెలుగు మాసాలు, ఫాల్గుణ పర్యంతము గృహ నిర్మాణము చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
చైత్రమాసం( Chaitra Month ) లో గృహప్రవేశం లేదా ఇల్లు కడితే అందులో ఉన్నవారికి అధిక భయం కలుగుతుంది.
వైశాఖ మాసంలో మంచి గ్రహబలం గల ముహూర్తాలు ఉంటాయి.వాటిని ఏర్పాటు చేసుకుని శంకుస్థాపన లేక గృహప్రవేశం చేస్తే ఆయురారోగ్య భాగ్యములు చేకూరుతాయి.
/br> """/" / జ్యేష్ట మాసంలో ఏ వాస్తు కారకుడు గృహ నిర్మాణము చేయకూడదు.
ఇది మరణప్రదము అని చెప్పవచ్చు.గృహములో యజమాని కూడా నివసించలేడు.
వంశవృద్ధి కూడా ఉండదు.ఆషాఢ మాసంలో కూడా అంత శ్రేయస్కరమైనది కాదు.
ఈ మాసంలో ఇల్లు కట్టుకుంటే పశునాశనము, కష్టనష్టములు చిక్కులు వస్తాయి.శ్రావణమాసం ఇది చాలా జయకరమైనదని చెప్పవచ్చు.
బంధుమిత్రులతో చాలా ఆనందకరముగా కాలం నడుస్తుంది.ఎలాంటి లోటు పాట్లు కలగవు.
భాద్రపద మాసం లో గృహ నిర్మాణమునకు యోగ్యముగా పరిగణించరు.కొంత మంది వలన పీడ, నరఘోష ఎక్కువగా ఉంటుంది.
ఈ సమయంలో ఇల్లు కడితే కలహాలు, అశాంతి, ధనవ్యయం, భీతి, అభిప్రాయ బేధాలు కలుగుతాయి.
ఇందుకు కార్తీక మాసం చాలా శ్రేష్టమైనది.ఆయురారోగ్యం, సుఖ క్షేమ లాభములు కలుగుతాయి.
బంధుమిత్రుల వలన గౌరవాదులు, జీవన లాభం, సంఘములో గౌరవము, జీవన లాభం కలుగుతుంది.
గేమ్ చేంజర్ సినిమాతో శంకర్ దశ మారనుందా..?