Dil Raju: దిల్ రాజు నిర్మాత మాత్రమే కాదు మ్యూజిక్ డైరెక్టర్గా కూడా పని చేశారని తెలుసా…ఏ సినిమా అంటే?

ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో ప్రొడ్యూసర్ దిల్ రాజు(Dil Raju) ఒకరు.

ఈయన కెరియర్ మొదట్లో డిస్ట్రిబ్యూటర్ గా పని చేస్తూ వచ్చారు.అనంతరం దిల్ సినిమాకు( Dil Movie ) నిర్మాతగా వ్యవహరించారు ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో ఈయన పేరు ముందు దిల్ చేరిపోయి దిల్ రాజుగా ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.

"""/" / ఇక ఇప్పుడు ఈయన తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా పాన్ ఇండియా స్థాయి సినిమాలకు కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నారని చెప్పాలి.

ప్రస్తుతం దిల్ రాజు రామ్ చరణ్ గేమ్ చేంజర్ (Game Changer) సినిమాని నిర్మిస్తున్నారు.

ఈ సినిమా దిల్ రాజుకు 50వ సినిమా కావటం విశేషం.ఈ సినిమా భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది.

ఈ విధంగా దిల్ రాజు ఇండస్ట్రీలో నిర్మాతగా( Producer ) ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

ఇకపోతే ఈయన నిర్మాతగా మాత్రమే కాకుండా సింగర్ అనే విషయం కూడా తెలిసిందే.

"""/" / ఈయనకు పాటలు అలాగే లిరిక్ పట్ల కూడా పూర్తిగా అవగాహన ఉందని ఇక పాటలను హమ్ చేసే విధానంపై కూడా మంచి అవగాహన ఉండటంతో ఈయన తన సినిమాలోని పాటలపై చాలా శ్రద్ధ చూపిస్తూ ఉంటారు అందుకే దిల్ రాజు సినిమాలలోని పాటలు పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటాయి.

ఇక ఈయన జోష్ సినిమా(Josh Movie) లో అన్నయ్య వచ్చినాడు అనే పాటను కూడా పాడిన సంగతి మనకు తెలిసిందే.

అయితే దిల్ రాజు సింగర్ గా మాత్రమే కాకుండా మ్యూజిక్ డైరెక్టర్ గా( Music Director) కూడా పని చేశారట.

"""/" / నాగచైతన్య నటించిన జోష్ సినిమా మ్యూజిక్ విషయంలో కూడా దిల్ రాజు పాత్ర ఉందని తెలుస్తుంది.

ఈయన ఈ సినిమాకు సంగీత దర్శకత్వపు బాధ్యతలను కూడా చేపట్టారని తెలుస్తోంది.ఇలా సంగీతం పై ఎంతో మంచి అవగాహన ఉన్నటువంటి దిల్ రాజు తన సినిమాలలోని మ్యూజిక్ అలాగే పాటల పట్ల శ్రద్ధ తీసుకుంటారు.

ఇలా ఈయనలో ఎవరికి తెలియనటువంటి ఈ టాలెంట్ కూడా దాగి ఉండడంతో బహుశా భవిష్యత్తులో ఈయన ఏదైనా తన సినిమాలకు పూర్తిస్థాయిలో సంగీత దర్శకత్వ బాధ్యతలు కూడా తీసుకోబోతున్నారని మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది.

రూ.16 లక్షలు నావే.. బ్యాంకు తప్పిదానికి రైతు షాక్ ట్రీట్‌మెంట్?