మెనోపాజ్ దశలో ఏయే ఆహారాలకు దూరంగా ఉండాలో తెలుసా?
TeluguStop.com

రుతుక్రమం ఆగిపోయే దశనే మెనోపాజ్ దశ అంటారు.ప్రతి మహిళా తన జీవితంలో ఎదుర్కొనే ఓ కఠిణమైన ఘట్టం ఇది.


ఎందుకంటే, ఒక మహిళ ఎంత ఆరోగ్యంగా, శక్తివంతంగా ఉన్నప్పటికీ.మెనోపాజ్ దశ వచ్చే సమయానికి ఎన్నో సమస్యలను ఫేస్ చేస్తుంది.


నిద్రలేమి, శరీరం నుండి వేడి ఆవిర్లు పుట్టడం, అధిక చెమటలు, లైంగిక కోరికలు సన్నగిల్లడం, చిన్న చిన్న విషయాలకే కోపం.
చిరాకు, మతిమరుపు, జుట్టు రాలడం, హార్ట్‌బీట్ పెరిగిపోవడం, తలనొప్పి ఇలా వివిధ రకాల సమస్యలు తీవ్రంగా మదన పెడుతూ ఉంటాయి.
ఆయా సమస్యల నుంచి రక్షణ పొందాలంటే అనేక జాగ్రత్తలను పాటించాలి.ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
పోషకాహారాలను డైట్‌లో చేర్చుకోవాలి.అదే సమయంలో కొన్ని కొన్ని ఆహారాలకు దూరంగా కూడా ఉండాలి.
మరి లేటెందుకు మెనోపాజ్ దశలో ఏయే ఆహారాలను ఎవైడ్ చేయాలో తెలుసుకుందాం పదండీ.
"""/" /
మెనోపాజ్ దశలో ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలంటే ప్రాసెస్డ్ ఫుడ్స్, వేపుళ్లు, నూనెలో వేయించిన ఆహారాలను పూర్తిగా ఎవైడ్ చేయాలి.
అలాగే వైట్ రైస్‌ను పక్కన పెట్టి.దాని బదులుగా దంపుడు బియ్యం, మొలకెత్తిన విత్తనలు, గోధుమలు వంటివి తీసుకోవాలి.
చక్కెర, చక్కెరతో తయారు చేసిన ఆహారాలను దూరం పెట్టాలి. """/" /
పాస్తా, బర్గర్లు, పిజ్జాలు, కేకులు, క్యాండీలు, కూల్ డ్రింక్స్ జోలికి పోకూడదు.
ఎందుకంటే.ఈ ఆహారాలు మధుమేహం, అధిక బరువు, రక్తపోటు తదితర సమస్యలను తెచ్చిపెడతాయి.
కాఫీ, టీ, మద్యం వంటి అలవాట్లు ఉన్నా.వాటిని ఎంత త్వరగా వదులుకుంటే అంత మంచిది.
అలాగే మెనోపాజ్ దశలో కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, విటమిన్ డి, విటమిన్ సి పుష్కలంగా ఉండే తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవాలి.
నట్స్, గుడ్డు, పాలు వంటివి రెగ్యులర్ డైట్‌లో ఉండేలా చూసుకోవాలి.రోజూ చిన్న చిన్న వ్యాయామాలు చేయాలి.
తద్వారా మెనోపాజ్ దశను సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తి శరీరానికి లభిస్తుంది.
ఆ హీరోయిన్ తో మరోసారి జత కడుతున్న శర్వానంద్.. బ్లాక్ బస్టర్ హిట్ దక్కుతుందా?