ఇంటి గుమ్మం ఏ దిక్కులో ఉంటే క్షేమకరమో తెలుసా?

మన దేశ ప్రజలు ఇంటి వాస్తు విషయంలో చాలా పర్టిక్యులర్ గా ఉంటారు.

ఎందుకంటే వాస్తు అనేది మన జాతి పరంపరలో ఓ భాగం కనుక.ప్రధానంగా హిందూ మతానికి చెందిన వారు వాస్తు ప్రకారమే తమ నిర్మాణాలు చేపడతారనే విషయం తెలియంది కాదు.

ఇక మన తెలుగు రాష్ట్రాల్లో… అయితే అన్ని దిక్కులను సంతృప్తి పరిచే విధంగా శాస్త్రాల ఆధారంగా నిర్మాణాలు చేపడతారు.

ఇక వాస్తు విషయంలో అందరూ భయపడే అంశం ఒకటి ఉంది.అదే వీధి పోటు.

వీధి పోటు ఉంటే దరిద్రం అనే భావన మనలో అనేకమందికి ఉంటుంది.అది ఎంత వరకు నిజం అనేది ఇపుడు చూద్దాం.

తూర్పు ఈశాన్యం నుండి ముఖ ద్వారానికి ఎదురుగా రోడ్ ఉన్నా, అలాగే ఉత్తర ఈశాన్యం నుండి ముఖ ద్వారానికి రోడ్ ఎదురుగా తగులుతుంటే మాత్రం వాస్తు మంచిదని చెబుతూ వుంటారు.

తూర్పు ఈశాన్యం నుండి తగిలితే పేరు ప్రతిష్టలు, సంఘంలో గౌరవం, మగవారికి కలిసి రావడం వంటి మంచి లాభాలు ఉన్నాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తున్నారు.

ఇక ఉత్తర ఈశాన్యం నుండి అయితే మంచి ఆర్ధిక పరిస్థితి ఉంటుందని కూడా వాస్తు శాస్త్రం ఘోషిస్తోంది.

అలాగే దక్షిణ ఆగ్నేయం, పశ్చిమ వాయవ్యం నుండి ముఖద్వారానికి ఎదురుగా రోడ్ ఉంటే లాభ నష్టాలు రెండూ లేకుండా సింపుల్ గా బ్రతికేస్తారు అని అంటారు.

ఇక పడమర, దక్షిణం, తూర్పు, ఉత్తరం దిశల నుండి రోడ్ ఉంటే అసలు ఏ మాత్రం మంచిది కాదని చెబుతూ వుంటారు.

నైరుతి, తూర్పు ఆగ్నేయం, ఉత్తర వాయవ్య దిక్కుల నుండి ముఖ ద్వారానికి ఎదురుగా రోడ్ ఉంటే తీవ్ర నష్టాలు ఎదుర్కొంటారని వాస్తు నిపుణులు చెప్తున్నారు.

అలాగే ఈశాన్యంలో ఉంటే అపార సంపద ఉంటుంది అని, కానీ ఏదో ఒక రోజు ఆ డబ్బు అక్రమ మార్గంలో వస్తె జీవితం శూన్యంగా మారుతుందని కూడా హెచ్చరిస్తున్నారు.

కాబట్టి మహాశయులారా మీమీ ఇంటి నిర్మాణాలను చేపట్టేటప్పుడు ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుంటారని మనవి.

నెల్లిమర్ల బహిరంగ సభలో వైసీపీకి డిపాజిట్లు కూడా రావు అంటూ చంద్రబాబు