రాగి లోహంతో తయారుచేసే సూర్యుడి రూపాన్ని ఇంట్లో ఏ దిశలో ఉంచితే మంచిదో తెలుసా..
TeluguStop.com
ప్రస్తుత సమాజంలో చాలామంది ప్రజలు ఉదయం లేచినప్పటి నుంచి ఉద్యోగాల వలన ఎప్పుడూ బిజీగా జీవితంతో పోరాడుతూనే ఉన్నారు.
ప్రస్తుత రోజుల్లో మనిషి జీవించడానికి డబ్బు ఎంతో అవసరం అయిపోయింది.అందువల్ల డబ్బు సంపాదించడం కోసం ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు ఎన్నో రకాల ప్రయత్నాలను మనిషి చేస్తూనే ఉన్నాడు.
ఈ క్రమంలో కుటుంబంలో, బయట ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.అంతేకాకుండా మరికొంతమంది జీవితంలో ఎదగడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.
అయితే వారి జీవితం లో ఎన్నో ఆటంకాలు ఎదురవుతూనే ఉంటాయి.కొన్నిసార్లు ఇంటి వాస్తు దోషాల వల్ల కూడా ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
అందుకే ఇల్లు నిర్మించేటప్పుడు వాస్తును కచ్చితంగా చూసుకోవాలని వాస్తు నిపుణులు చెబుతూ ఉంటారు.
అంతేకాకుండా రాగితో తయారుచేసిన సూర్యుడిని రూపాన్ని ఇంట్లో ఉంచడం వల్ల కూడా కొన్ని రకాల సమస్యలు దూరం చేసుకోవచ్చు.
అయితే రాగి లోహంతో తయారుచేసిన సూర్యుడి రూపాన్ని ఇంట్లో ఏ దిశలో పెట్టడం వల్ల కుటుంబానికి సూర్య భగవంతుడి అనుగ్రహం లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
వాస్తు శాస్త్రం ప్రకారం రాగి లోహంతో తయారుచేసిన సూర్యుడు అంగారక గ్రహానికి సంబంధించిన గ్రహం.
అందుకే ఈ సూర్యుడు రూపాన్ని మీ ఇంట్లో బాల్కనీలో తప్పనిసరిగా ఉంచుకోవడం ఎంతో మంచిది.
వాస్తు ప్రకారం బాల్కనీకి తూర్పు దిశలో రాగి సూర్యుడి రూపాన్ని ఉంచడం శుభప్రదంగా వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
"""/"/
ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ బయటికి వెళ్లిపోతుంది.
పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.అంతేకాకుండా ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు కూడా దూరం అవుతాయి.
ఇంకా చెప్పాలంటే రాగి లోహంతో తయారు చేసిన సూర్యుడి రూపాన్ని ఇంట్లో ఉంచుకోవడానికి కొన్ని ప్రత్యేకమైన నియమాలు కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది.
రాగి లోహపు సూర్యుడు విగ్రహం ఇంటికి తూర్పు దిశలో మాత్రమే ఉండేలా చూసుకోవడం ఎంతో మంచిది.
కానీ దాని ముందు కిటికీ లేదా రహదారిలేని ప్రదేశంలో మాత్రమే ఉంచాలి.ఇలా చేయడం వల్ల ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు ఆప్యాయతగా ఉంటాయి.
శంకర్ పేరు చెబితేనే భయంతో పరుగులు పెడుతున్న స్టార్ హీరోలు…