హాకీ వరల్డ్ కప్‌లో ఇప్పటివరకు ఎక్కువ ట్రోఫీలు గెలుచుకున్న దేశం ఏదో తెలుసా..

మెన్స్ హాకీ వరల్డ్ కప్ 52 సంవత్సరాల నుంచి జరుగుతోంది.1971లో మొట్టమొదటిసారిగా హాకీ ప్రపంచ కప్ జరిగింది.

ఈ టోర్నీని స్పెయిన్‌లోని బార్సిలోనా సిటీలో నిర్వహించారు.ఈ వరల్డ్‌ కప్‌లో పాకిస్థాన్‌, స్పెయిన్ టీమ్స్ ఫైనల్స్ కు చేరుకున్నాయి.

హోమ్ టీమ్ గెలుస్తుందని అందరూ భావించారు కానీ పాక్ టీమ్ విజయ పతాకం ఎగురవేసి టైటిల్ గెలుచుకుంది.

అలా మొదటి హాకీ ప్రపంచ కప్‌ విన్ అయిన పాక్ ఆపై కూడా 3 సార్లు టైటిల్ గెలుచుకుంది.

గత 52 ఏళ్లలో హాకీ వరల్డ్ కప్ 14 సార్లు నిర్వహించగా.వీటిలో పాక్ 4 సార్లు, ఆస్ట్రేలియా 3 సార్లు, నెదర్లాండ్స్ 3 సార్లు నెగ్గాయి.

ఇండియన్ టీమ్ కేవలం ఒకేసారి విజయం సాధించగలిగింది. """/"/ హాకీ ప్రపంచకప్‌ను ఏ దేశం ఎప్పుడు గెలుచుకుందో తెలుసుకుంటే.

1971 హాకీ ప్రపంచ కప్‌లో పాకిస్థాన్‌, 1973లో నెదర్లాండ్స్, 1975లో భారతదేశం, 1978లో పాకిస్థాన్‌, 1982లో పాకిస్థాన్‌, 1986లో ఆస్ట్రేలియా, 1990లో నెదర్లాండ్స్, 1994లో పాకిస్థాన్‌, 1998లో నెదర్లాండ్స్, 2002లో జర్మనీ, 2006లో జర్మనీ, 2010లో ఆస్ట్రేలియా, 2014లో ఆస్ట్రేలియా, 2018లో బెల్జియం దేశాలు విన్ అయ్యాయి.

"""/"/ జనవరి 13 నుంచి FIH పురుషుల హాకీ ప్రపంచ కప్ 2023 మన ఇండియాలోనే ప్రారంభమైంది.

మరి ఇందులో నైనా ఇండియా గెలిచి తన సత్తా చాటుతుందో లేదో చూడాలి.

అయితే రూర్కెలాలో నిన్న జరిగిన ఎఫ్‌ఐహెచ్ పురుషుల హాకీ 2023లో భారత్ 2-0 తేడాతో స్పెయిన్‌ను ఓడించింది.

ఇండియా ఆడిన తొలి మ్యాచ్‌లోనే సక్సెస్ సాధించింది కాబట్టి ఈసారి కప్పు కొట్టడం ఖాయమని చాలామంది అభిప్రాయపడుతున్నారు.

తెలుగులో నాని తమిళ్లో కార్తీ.. వీరిద్దరిని చూడటానికి రెండు కళ్ళు సరిపోవు..!