విమానంలో బిడ్డ పుడితే ఏ దేశ పౌర‌స‌త్వం ల‌భిస్తుందో తెలుసా...?

సాధార‌ణంగా మ‌నం ఏ దేశంలో పుడితే ఆ దేశం పౌరస‌త్వం ల‌భిస్తుంది.అయితే ఈ పౌర‌స‌త్వం విష‌యంలో కూడా అనేక దేశాల‌కు అనేక నిబంధ‌న‌లు ఉన్నాయ‌నే చెప్పాలి.

మొద‌టి నుంచి వీటి విష‌యంలో ప్ర‌తి దేశం కూడా చాలా క‌ఠిన‌త‌రంగానే వ్య‌వ‌హ‌రిస్తోంది.

అయితే ఓ చిన్న డౌట్ ఇప్పుడు అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది.ఒక‌వేళ ఆకాశంలో విమానంలో పుడితే ఏ దేశం పౌర‌స‌త్వం ల‌భిస్తుంది అనేది ఇప్పుడు అంద‌రినీ షాక్ కు గురి చేస్తున్న క్వ‌శ్చ‌న్‌.

అదేంటి విమానంలో పుడితే ఆ పేరెంట్స్ ఏ దేశానికి చెందిన వారైతే ఆ దేశం పౌర‌స‌త్వం ల‌భిస్తుంది.

అనుకుంటున్నారు క‌దా.అయితే అక్క‌డే మీరే పొర‌ప‌డ్డార‌ని చెప్పొచ్చు.

ఎందుకంటే ఇందుకు కొన్ని నిబంద‌న‌లు కూడా ఉన్నాయండోయ్‌.ఇలాంటి స‌మాచారం ప్ర‌తి ఒక్క‌రికీ చాలా అవ‌స‌రం.

కానీ చాలామందికి ఇలాంటి రూల్స్ గురించి పెద్ద‌గా తెలియ‌ద‌నే చెప్పాలి.ఇప్పుడు దీని గురించి తెలుసుకుందాం.

ఉదాహ‌ర‌ణ‌కు ఇండియా నుంచి ఓ విమానం అమెరికాకు వెళ్తున్న క్ర‌మంలో ఆకాశంలోనే బిడ్డ పుడితే గ‌న‌క ఆ స‌మ‌యానికి ఆ విమానంలో ఏ దేశ గ‌గ‌న‌త‌లంలో ఉంటే ఆ దేశ పౌర‌స‌త్వం తీసుకోవ‌చ్చంట‌.

ఇదే వార్త ఇప్పుడు నెట్టింట విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది.ఇక ఇలా ఆ దేశ పౌర‌స‌త్వం కోసం త‌ల్లిదండ్రులు అప్లై చేసుకోవచ్చు.

ఇక ఆ దేశ ప్ర‌భుత్వం కూడా రూల్స్ ప్ర‌కారం త‌మ దేశ పౌరసత్వం ఇవ్వాల్సిందేన‌ట‌.

ఇక ఇందుకు సంబంధించి విదేశీ పాలసీలను ఇప్ప‌టికే ఎన్నో ప్ర‌పంచ దేశాలు మార్చుకున్నట్టు స‌మాచారం.

ఇక ఇక్క‌డ మ‌రో ముఖ్య‌మైన విష‌యం ఏంటంటే ఆ బిడ్డ త‌ల్లి దండ్రులు ఏ దేశానికి చెందిన వార‌నేది అవ‌స‌రం లేదు.

ఏ దేశం అయినా స‌రే ఆ బిడ్డ త‌మ గ‌గ‌న త‌లం మీద పుడితే ఒక‌వేళ పేరెంట్స్  అప్లై చేసుకుంటే గ‌న‌క క‌చ్చితంగా పౌర‌స‌త్వం ఇవ్వాల్సిందే నంట‌.

పంజాబ్ కింగ్స్ ఓటమికి ముంబై గెలుపుకి ఇదెక్కోటే కారణం…