ఇంట్లో ఏ తులసి మొక్కను పెంచుకోవాలో తెలుసా..?
TeluguStop.com

సనాతన ధర్మంలో తులసి మొక్క( Basil Plant )కు చాలా గొప్ప ప్రాముఖ్యత ఇవ్వబడింది.


అలాగే పూజ, ఆచారాలు, ప్రసాదాలలో కూడా దీన్ని చేర్చబడుతుంది.తులసి మొక్కను మతంతో పాటు వైద్యంలో కూడా ఉపయోగిస్తారు.


సనాతన ధర్మాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరు కూడా తులసి మొక్కను పూజిస్తారు.ప్రతిరోజు సాయంత్రం దీపం వెలిగించి తులసి మొక్కకు నీళ్లు సమర్పిస్తారు.
తులసి మొక్కను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు.పురాణాల ప్రకారం తులసి మొక్క ఉన్న ఇల్లు సంపదకు, దేవత అయినా లక్ష్మీ( Sri Lakshmi Devi ) నిలయం.
ఇక శాస్త్రాల ప్రకారం తులసి రెండు రకాలు.ఒకటి రామ మరొకటి కృష్ణ తులసి.
మీ ఇంటి ప్రాంగణంలో రామ,కృష్ణతులసి లో ఏ మొక్కను పెంచాలో ఈరోజు తెలుసుకుందాం.
"""/" / రామ,కృష్ణ తులసి రెండు కూడా హిందూ మతంలో పవిత్రమైనవిగా పరిగణించబడతాయి.
అయితే వాస్తు శాస్త్రం ప్రకారం రామ తులసిని ఇంట్లో ప్రతిష్టించడం వలన చాలా శుభప్రదం.
ఎందుకంటే రామ తులసి ఇంట్లో ఉంటే ఆనందం, శ్రేయస్సు, సానుకూల శక్తి ఆకర్షిస్తుంది.
అలాగే రామ తులసిని ప్రజలు ఆచార భద్రంగా పూజిస్తారు.ఇక ముదురు తులసిని మూలికాగా ఉపయోగిస్తారు.
సనాతన ధర్మంలో తులసి మొక్క చాలా ముఖ్యమైనది.కృష్ణ తులసి( Krishna Tulasi ) ఆకులు ముద్రరంగులో ఉంటాయి.
ఇక రామ తులసి ఆకులు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. """/" / ఇక ముదురు తులసి ఎక్కువగా అడవులలో కనిపిస్తాయి.
అయితే రామ తులసి, కృష్ణ తులసి రెండు ఒకేలా ఉంటాయి.అయితే ఇంట్లో మాత్రం రామ తులసి ప్రతిష్టించడం ప్రత్యేకం.
ఇంట్లో తులసి మొక్క ఉంటే దానిని తప్పనిసరిగా కొన్ని నియమాలతో పూజించాలి.ఆదివారాల్లో, ఏకాదశి( Ekadashi ) రోజుల్లో తులసి మొక్కకు నీరు సమర్పించకూడదు.
అలాగే తులసిని శుభ్రమైన చేతులతో మాత్రమే తాకాలి.స్నానం చేయకుండా, మురికి చేతులతో తులసిని తాకకూడదు.
అంతేకాకుండా తులసి మొక్క చుట్టూ ఎప్పుడు పరిశుభ్రత ఉండేటట్టు చూసుకోవాలి.
తన తల్లికి గోల్డ్ చైన్ కుంభమేళ బ్యూటీ మోనాలీసా (వీడియో)