భారతదేశంలో అత్యధిక ఆదాయం సంపాదిస్తున్న రైల్వే స్టేషన్స్ ఏవో తెలుసా..?
TeluguStop.com
భారతీయ ప్రజా రవాణా వ్యవస్థకు వెన్నెముక భారతీయ రైల్వేలు.ఇది లక్షలాది మంది ప్రజలను సురక్షితంగా వారి గమ్యస్థానానికి చేర్చడమే కాకుండా, సరుకు రవాణాలో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
తద్వారా దేశాభివృద్ధితో పాటు ఆర్థికాభివృద్ధికి భారతీయ రైల్వేలు( Indian Railways ) ఎంతగానో దోహదపడుతున్నాయి.
ఇతర రవాణా వ్యవస్థల కంటే రైలు ప్రయాణం తక్కువ ఖర్చుతో కూడుకోవడంతో పాటు.
సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా సురక్షితంగా కూడా ఉంటుంది.అందుకే భారతీయులు రైలు ప్రయాణం చేయడానికి ఇష్టపడతారు.
అందుకే శతాబ్దాలుగా దేశ ప్రజలు రైల్వేను ఇష్టపడుతున్నారు.దీని వల్ల రైల్వే శాఖ కేంద్ర ప్రభుత్వానికి మంచి ఆదాయ వనరుగా మారింది.
ఇక ఈ రైలు ప్రయాణం పేద, మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలో ఉండడంతో సంపాదన పరంగా మన రైల్వేలు చాలా లాభాలలో నడుస్తున్నాయి.
ఈ ఆర్థిక సంవత్సరంలో 2024-25లో రైల్వేలకు కేంద్రం రూ.2,62,200 కోట్లు కేటాయించిందంటే ఆదాయం ఏ స్థాయిలో ఉంటుందో అర్థమవుతోంది.
ఇలా ప్రజా రవాణాలోనే కాకుండా సంపాదనలో కూడా మన భారతీయ రైల్వే అగ్రస్థానంలో ఉంది.
దేశంలోని అనేక రైల్వే స్టేషన్లు ఏటా కోట్లాది రూపాయల ఆదాయం పొందుతున్నాయి.దేశంలో అత్యధిక ఆదాయాన్ని పొందుతున్న అగ్ర రైల్వే స్టేషన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
"""/" /
భారతదేశంలోని ప్రధాన రైల్వే స్టేషన్లలో న్యూ ఢిల్లీ (New Delhi) ఒకటి.
దేశంలోని అన్ని రాష్ట్రాలు, ప్రధాన నగరాల నుండి ఇక్కడకి రైలు సేవలు అందుబాటులో ఉన్నాయి.
దీంతో నిత్యం వేలాది మంది ప్రయాణికులు వస్తూ పోతూ ఉంటారు.వందలాది రైళ్లు రాకపోకలు సాగిస్తుండటంతో నిత్యం ఇక్కడ సందడి నెలకొంది.
ప్రతిరోజు 250కి పైగా రైళ్లు ఇక్కడి గుండా వెళుతున్నాయి.రైల్వే టిక్కెట్లు కాకుండా, రైల్వే స్టేషన్లు స్టేషన్ వ్యాపారాలు.
ఇంకా ఇతర వనరుల నుండి కూడా ఆదాయాన్ని పొందుతాయి.ఈ విధంగా, దేశంలో అత్యధిక ఆదాయాన్ని ఆర్జించే స్టేషన్ల జాబితాలో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ అగ్రస్థానంలో ఉంది.
ఈ ఒక్క స్టేషన్‌కే ఏటా రూ.3337 కోట్ల ఆదాయం వస్తోంది.
"""/" /
హౌరా స్టేషన్ (Howrah Station) భారతదేశంలోని పురాతన రైల్వే స్టేషన్లలో ఒకటి.
ఇది పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో( Kolkata) ఉంది.స్వాతంత్య్రానికి 90 ఏళ్ల ముందు అంటే 1854లోనే ఈ రైల్వే స్టేషన్ నుంచి రైల్వే సేవలు ప్రారంభమయ్యాయి.
ప్రస్తుతం ఈ స్టేషన్ నుండి దేశంలోని అనేక ప్రాంతాలకు రైళ్లు నడుస్తున్నాయి.ఈ స్టేషన్ ప్రతిరోజూ లక్షల మంది ప్రయాణికులకు సేవలను అందిస్తుంది.
ఆదాయాల పరంగా, హౌరా స్టేషన్ దేశంలోనే అత్యధికంగా సంపాదిస్తున్న రెండవ స్టేషన్.ఈ స్టేషన్‌కు ప్రతి సంవత్సరం రూ.
1692 కోట్ల ఆదాయం వస్తోంది. """/" /
దక్షిణ రైల్వే జోన్ భారతదేశంలోని రైల్వే జోన్లలో ఒకటి.
దీని ప్రధాన కార్యాలయం తమిళనాడు రాజధాని చెన్నై( Chennai ).ఇక చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ దేశంలోని ముఖ్యమైన స్టేషన్లలో ఒకటి.
ఈ స్టేషన్ నుంచి రోజూ వందల సంఖ్యలో రైళ్లు వచ్చి వెళ్తుంటాయి.వేల సంఖ్యలో ప్రజలు ప్రయాణిస్తుంటారు.
దేశంలోనే అత్యధిక ఆదాయాన్ని ఆర్జిస్తున్న రైల్వే స్టేషన్లలో చెన్నై సెంట్రల్ స్టేషన్ మూడో స్థానంలో ఉంది.
ఈ స్టేషన్‌కు ఏటా రూ.1,299 కోట్ల ఆదాయం వస్తోంది.
వామ్మో.. అక్కడ ప్రతి ఒక్క మహిళకి ఆరు అడుగులపైనే జుట్టు.. ఎందుకంటే?