అన్నం తిన్న ప్లేటులోనే చెయ్యి కడగడం మంచిదా కాదో తెలుసా..

చాలా మంది ప్రజలు భోజనం చేసిన తర్వాత తిన్నా ప్లాట్ లోనే చేతులు కడుకుంటు ఉంటారు.

మరికొంత మంది పక్కకు వెళ్లి చేతులను కడుక్కుంటూ ఉంటారు.కానీ అన్నం తిన్న ప్లేటులోనే చేతులు కడుకోవాలని చాలామంది పెద్దవారు చెబుతూ ఉంటారు.

కానీ జ్యోతిష్య నిపుణులు అలా చేయకూడదని చెబుతున్నారు.దరిద్ర దేవత అనుగ్రహం కోరుకునేవారు అలా చేస్తారంటూ చెబుతున్నారు.

అయితే ఇలా చేయడం వల్ల ధనవంతులుగా ఉండి, తమ సంపద అంతా దూరం అయ్యే అవకాశం ఉంది.

దారిద్ర్యాన్ని అనుభవించాలనుకునే వారు మాత్రమే అన్నం తిన్న తర్వాత ప్లేట్‌లో చేతులు కడుక్కుంటారని జ్యోతిష శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

ఎప్పుడైనా అన్నం తినేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.అన్నం తినే సమయంలో మనం తినే ప్లేటు మనపై అస్సలు ఉండకూడదు.

అన్నం తింటూ తింటూ ఇల్లంతా చల్లడం లాంటి పనులు చేయకూడదు.అలా చేయడంవల్ల ఆ ఇంట్లోకి దరిద్ర దేవతలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.

తమ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలనుకునేవారు ఇల్లు శుభ్రంగా ఉంచుకొని భోజనం చేయాలి.

ప్లేటు చుట్టూ పడకుండా భోజనం చేయాలి.ప్లేటులో అన్నం మిగలకుండా తినడం ఎంతో మంచి పని.

అన్నం తినేటప్పుడు అరచేతిని తాకకుండా వేళ్ళ చివరతో మాత్రమే తినాలి.మరికొంతమంది నడుస్తూ, నిలబడి భోజనం చేస్తూ ఉంటారు.

అలా చేయడం కూడా అంత మంచిది కాదు.మనం తినే భోజనం అన్నపూర్ణాదేవితో సమానమని భోజనం తిన్న తర్వాత అన్నపూర్ణ దేవి పై చేతులును కడగకూడదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

"""/"/ ఎవరైతే ఎంతో నియమ నిబద్ధతతో భోజనం చేస్తారో వారికి ఎప్పుడు భోజనానికి ఇబ్బంది ఉండదు.

ఏ మనిషేనా భోజనం ఎలా చేస్తారో దాన్ని బట్టి మనిషి ఎలాంటి వాడో చెప్పవచ్చు అని కూడా చెబుతున్నారు.

ఇంకా చెప్పాలంటే పెళ్లి ఫంక్షన్లకు వెళ్లినప్పుడు అన్నం తినడానికి కూర్చున్నవారు అందరూ అన్నం తినడం పూర్తి చేసే వరకు మనం కూడా లేవకుండా అలాగే ఉండడం ఎంతో మంచిది.

రూ. 1 కోటి ప్రశ్నకు సరైన సమాధానం చెప్పినా.. కంటెస్టెంట్ కి నిరాశే..?