దేవుడికి నైవేద్యంగా మాంసం పెట్టే దేవాలయం ఎక్కడుందో తెలుసా?

మన భారతదేశంలో సంస్కృతి సాంప్రదాయాలకు ఎంతో ప్రాముఖ్యతను ఇస్తారు.ఏవైనా పూజా కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు స్వామివారికి ఎంతో శుభ్రంగా తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించి పూజలను నిర్వహించడం మనం చూసే ఉంటాం.

కానీ ఎప్పుడైనా దేవుళ్లకు చాక్లెట్లు, బిస్కెట్లు, మద్యం, మాంసం నైవేద్యంగా సమర్పించడం మీరు విన్నారా? అవును వారణాసిలో ఉన్న బాబా బాతుక్ భైరవ ఆలయంలో దేవుడికి నైవేద్యంగా మాంసం సమర్పిస్తారు.

అయితే ఈ ఆచారం ఇక్కడ ఎన్నో ఏళ్లుగా కొనసాగిస్తున్నారు.అయితే ఈ ఆలయం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

వారణాసిలో ఉన్న బాబా బాతుక్ భైరవ ఆలయంలో ఉన్న మహాదేవుడు.సాత్విక రూపం, రజస్వరూపం, తామస రూపం అని మూడు రూపాలలో భక్తులకు దర్శనం ఇస్తారు.

ఉదయం స్వామి వారిని సాత్విక రూపంలో చిన్నారి స్వామిగా అలంకరించి స్వామివారికి పిల్లలచేత చాక్లెట్లు, బిస్కెట్లను నైవేద్యంగా సమర్పిస్తారు.

ఇక మధ్యాహ్న సమయంలో స్వామివారి వస్త్రాలను మార్చి రజస్వరూపంలో అలంకరిస్తారు.అప్పుడు స్వామివారికి అన్నం ,పప్పు, బ్రెడ్ మొదలైన పదార్దాలను నైవేద్యంగా సమర్పిస్తారు.

"""/" / రాత్రి సమయంలో స్వామివారిని తామస రూపంలో అలంకరిస్తారు.ఈ రూపంలో స్వామివారు చూడటానికి భయంకరమైన ఉగ్రరూపంలో ఉంటారు.

ఈ రూపంలో ఉన్న స్వామివారికి భక్తులు పెద్ద ఎత్తున మటన్, చికెన్, చేపలను నైవేద్యంగా సమర్పిస్తారు.

మాంసంతో పాటు మద్యాన్ని కూడా స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు.ఇక్కడికి చేరుకున్న భక్తులు స్వామివారి మూడు రూపాలను దర్శించుకోవడానికి రోజంతా అక్కడే వేచి ఉంటారు.

ఉదయంవేళ సాత్విక రూపంలో ఉన్న చిన్నారి స్వామికి నమస్కరించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగి పోయి, సుఖ సంతోషాలతో ఉంటారని ఇక్కడి వారి ప్రగాఢ నమ్మకం.

అయితే స్వామివారికి ఇలా మద్యం మాంసం నైవేద్యంగా సమర్పించి పూజించడం గత కొన్ని సంవత్సరాల నుంచి ఒక ఆచారంగా వస్తోంది అని పండితులు తెలియజేశారు.

ఫ్లాప్ డైరెక్టర్ల పాలిట దేవుడిగా మారిన తారక్.. ఆ సెంటిమెంట్ తో దేవర బ్లాక్ బాస్టర్!