41 ప్రదక్షణలతో కోరికలు తీర్చే ఆలయం ఎక్కడ ఉందో తెలుసా..?

తెలుగు రాష్ట్రాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన వరంగల్ పట్టణం పేరు వినగానే మనకు వెంటనే గుర్తొచ్చేది అక్కడ వెలిసినటువంటి వేయి స్తంభాల గుడి.

ఈ ఆలయంలో రుద్రేశ్వర స్వామి వారు కొలువై ఉండి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు.

తూర్పు అభిముఖంగా ఉన్న ఈ ఆలయానికి సుమారు 820 సంవత్సరాల చరిత్ర కలిగినదిగా అక్కడి శాసనాలు తెలియజేస్తున్నాయి.

ఈ ఆలయంలోనికి ప్రవేశించగానే మధ్యలో ఓ మంటపంలో ఆ పరమేశ్వరుడు రుద్రేశ్వరుడుగా కొలువై ఉండి భక్తులకు దర్శనం కల్పిస్తుంటారు.

అతి పురాతనమైన ఈ ఆలయంలో అత్యంత పెద్దదైన శివలింగంగా రుద్రేశ్వరుడు పూజలందుకుంటున్నాడు.ఆలయ ప్రాంగణంలోనే కన్యకాపరమేశ్వరి ఆలయం, ఆంజనేయ, వీరభద్ర, నవగ్రహాలు కూడా మనకు దర్శనం కల్పిస్తాయి.

క్రీ.శ1194 రుద్రదేవుడు పాలన చేస్తున్న సమయంలో కాకతీయ కొలువులో పనిచేస్తున్న 30 మంది సైనికులు ఈ ఆలయాన్ని నిర్మించారని తెలుస్తోంది.

తిరిగి 2006వ సంవత్సరంలో ఈ ఆలయ పునర్నిర్మాణం జరిగింది.తమిళనాడు నుంచి ఎంతో నైపుణ్యం గల శిల్పులను పిలిపించి ఆలయ నిర్మాణం చేపట్టారు.

ఇది పూర్తి కావడానికి దాదాపు ఆరు సంవత్సరాలు పట్టింది 2012 ఫిబ్రవరి 12న ప్రతిష్ఠాపన మహోత్సవం ఘనంగా జరిగింది.

కాకతీయుల శివలింగాన్నే పునఃప్రతిష్ఠించారు. """/" / రుద్రేశ్వరుడుగా ఈ ఆలయంలో ఎన్నో పూజలందుకుంటున్న ఆ రుద్రునికి 41 సార్లు ప్రదక్షణ చేసి, ఆ పరమేశ్వరుడికి ఎదురుగా ఉన్న నది చెవిలో మన కోరికను చెప్పడం వల్ల ఆ కోరిక కచ్చితంగా నెరవేరుతుందనీ భక్తులు విశ్వసిస్తుంటారు.

కాబట్టి కోరిన కోరికలు తీర్చే స్వామిగా భక్తులు రుద్రేశ్వరున్ని పూజిస్తారు.ఎంతో ప్రసిద్ధి గాంచిన ఈ ఆలయంలోని స్వామి వారికి ప్రతీ మాస శివరాత్రికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.

ప్రతి సంవత్సరం శివరాత్రికి ఘనంగా ఈ ఆలయంలో జాతర జరుగుతుంది.ఈ సందర్భంగా చుట్టుపక్కల గ్రామస్తులు పెద్ద ఎత్తున ఎడ్లబండినీ చక్కగా అలంకరించుకుని స్వామి వారి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ మొక్కులు చెల్లించుకుంటారు.

ఈ నలుగురు హీరోయిన్స్ భవిష్యత్తు ప్రభాస్ పైనే ఆధారపడి ఉంది!